ఉద్యోగాలపై శుభవార్త చెప్పిన ప్రభుత్వం

16 May, 2017 20:09 IST|Sakshi
ఉద్యోగాలపై శుభవార్త చెప్పిన ప్రభుత్వం

న్యూఢిల్లీ: దేశీయ ఐటీ రంగంలో నెలకొన్న సంక్షోభంపై  కేంద్రం స్పందించింది.  టెక్నాలజీ రంగంలో పెద్దయెత్తున ఉద్యోగ నష్టాలు లేవని,  పైగా వృద్ధిని కనబరుస్తోందని ఐటి శాఖ మంగళవారం తెలిపింది. టెక్నాలజీ పరిశ్రమ వృద్ధి కొనసాగుతుందని ఐటీ  సెక్రటరీ అరుణ సుందర రాజన్‌  భరోసా ఇచ్చారు. ఈ సెక్టార్‌ 8-10శాతం గ్రోత్‌ నమోదు చేస్తుందని తెలిపారు.  అంతేకాదు భారీగా ఉద్యోగాల  కోత ఉంటుందన్న అంచనాలను ఆమె కొట్టి  పారేశారు.  బ్రాడ్‌ బాండ్‌ఇండియా ఫోరం కార్యక్రమంలోపాల్గొన్న  ఆమె ఈ స్పష్టత ఇచ్చారు.  ఐటీలో నియామకాలు కొనసాగుతాయని హామీ ఇచ్చారు. గత రెండున్నరేళ్లలో 5లక్షల ఉద్యోగాలను ఐటీ పరిశ్రమ కల్పించిందని ఇది ఇకముందు కూడా కొనసాగుతుందని  ఆమె తెలిపారు.
 
అంతే కాకుండా, క్లౌడ్,బిగ్‌ డేటా,  డిజిటల్ చెల్లింపులు రావడంతో  ఐటీ ఉద్యోగ ప్రొఫైల్‌ మార్పు చెందుతోందని సుందరరాజన్ తెలిపారు.  రెగ్యులర్ వార్షిక రివ్యూలో భాగంగానే  ఈ తీసి వేతలని, కానీ ఈ ఏడాది హఠాత్తుగా ఉద్యోగాల సంఖ్య తగ్గుతుందని అనుకోవడం పూర్తిగా తప్పు అని ఐటి కార్యదర్శి  చెప్పారు.  ఈ సమస్య "సంపూర్ణంగా" చూడాల్సిన అవసరం ఉందన్నారు.  ఈ విషయంలో పరిశ్రమనుంచి  ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఆమె నొక్కిచెప్పారు.
కాగా మెకిన్సే & కంపెనీ నివేదిక కూడా ఈ సంవత్సరం ప్రారంభంలో ఐటీ సేవల సంస్థల్లోని దాదాపు సగం మంది ఉద్యోగులు తదుపరి 3-4 సంవత్సరాల్లో ఉద్యోగాలను కోల్పోనున్నారని నివేదించింది. రాబోయే మూడేళ్లలో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్నిఅందుకోలేని  1.75 లక్షల నుండి 2 లక్షల మధ్య కోత ఉంటుందని అని ఎగ్జిక్యూటివ్ సెర్చ్ సంస్థ హెడ్ హంటర్స్ ఇండియా ఇటీవల వెల్లడించింది. దీనికి తోడు గత కొన్ని వారాల్లో, ఐటి రంగం అంతటా తొలగింపు నివేదికలు  వచ్చాయి.  ప్రధానంగా టెక్‌ మేజర్లు విప్రో,  ఇన్ఫోసిస్‌, కాగ్నిజెంట్‌, టెక్‌ మహీంద్ర లాంటి  కంపెనీల్లో భారీ ఉద్యోగాల కోత ఆందోళన రేపిన సంగతి తెలిసిందే.

 

మరిన్ని వార్తలు