రిమోట్తో రాష్ట్రాన్ని పాలిస్తారా: మోదీ

9 Oct, 2015 16:53 IST|Sakshi

బిహార్లో మహాకూటమి అధికారంలోకి వస్తే, ఆర్జేడీ అధినేత లాలుప్రసాద్ రిమోట్ కంట్రోల్తో రాష్ట్రాన్ని పాలించాలనుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ మండిపడ్డారు. లాలు అసలు ఈసారి ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయడం లేదని ప్రశ్నించారు. ఆయన చేసిన తప్పుల వల్లే ఎన్నికల్లో పోటీ చేయడానికి లేకుండా పోతోందని, అందుకే భారత న్యాయవ్యవస్థ ఆయనను ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆపిందని చెప్పారు.

గతంలో దివంగత జగ్జీవన్ రామ్ ప్రాతినిధ్యం వహించిన ససారమ్ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో ఆయన బీహార్ సీఎం నితీష్ కుమార్ మీద కూడా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. జితన్ రామ్ మాంఝీని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి దళితులకు వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. నితీష్ పొగరే ఆయనను ఓడిస్తుందని, తన స్వార్థం కోసం దళితుడికి వెన్నుపోటు పొడవడం లాంటి పాపాలకు పాల్పడ్డారన్నారు.

మరిన్ని వార్తలు