పాక్ ప్రధాని షరీఫ్ కు షాక్

20 Oct, 2016 17:24 IST|Sakshi
పాక్ ప్రధాని షరీఫ్ కు షాక్

ఇస్లామాబాద్: పనామా పేపర్ల కేసులో పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్, ఆయన కుటుంబసభ్యులకు ఆ దేశ సుప్రీం కోర్టు గురువారం నోటీసులు జారీ చేసింది. షరీఫ్ అవినీతికి పాల్పడ్డారని, విదేశాల్లో అక్రమంగా ఆస్తులు కలిగివున్నారని ఆయన ప్రధానమంత్రి పదవిలో కొనసాగడానికి అనర్హుడని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.

పాకిస్తాన్ తెహ్రీక్-ఈ-ఇన్సాఫ్ పార్టీ లీడర్ ఇమ్రాన్ ఖాన్ దాఖలు చేసిన పిటిషన్ సైతం కోర్టు విచారణకు స్వీకరించింది. పనామా పేపర్ల లీక్ అనంతరం షరీఫ్, ఆయన కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ధనాన్ని విదేశాలకు తరలించినట్లు, యూకేలో ఆస్తులు కూడా ఉన్నట్లు ఇమ్రాన్ తన పిటిషన్ లో పేర్కొన్నారు.

షరీఫ్ తో పాటు ఆయన తనయ మార్యామ్, తనయులు హాసన్, హుస్సేన్, మేనల్లుడు మొహమ్మద్ సఫ్దార్, ఆర్ధిక శాఖ మంత్రి ఇషాక్ దార్, ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డైరెక్టర్, ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ చైర్మన్, అటార్నీ జనరల్ లకు కోర్టు నోటీసులు పంపింది. కాగా పిటిషన్లపై ప్రాథమిక విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి అన్వర్ జహీర్ జమాలీ, జస్టిస్ జాజుల్ అషాన్, జస్టిస్ ఖిజి ఆరిఫ్ హుస్సేన్ లతో కూడిన ధర్మాసనం తదుపరి విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు