నేను అధ్యక్షుడిని.. నువ్వు కాదు: ట్రంప్‌

24 Mar, 2017 23:25 IST|Sakshi
నేను అధ్యక్షుడిని.. నువ్వు కాదు: ట్రంప్‌

న్యూయార్క్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌  మీడియాపై ఆగ్రహాన్ని ఎంతమాత్రమూ దాచుకోవడం లేదు. టైమ్‌ మ్యాగజైన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ట్రంప్‌.. తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకున్న కొన్ని వివాదాస్పద నిర్ణయాలను సమర్థించుకున్నారు. ‘నేను విభిన్న ఆలోచనలు కలిగిన వ్యక్తిని.. నా స్వభావం, ఆలోచనలు సరైనవి. అవే నిజమవుతాయి. నేను అంత చెడుగా ఏమీ చేయట్లేదని అనుకుంటున్నాను.. ఎందుకంటే నేను ఈ దేశానికి అధ్యక్షుడిని.నువ్వు కాదు’ అని టైమ్స్‌ వాషింగ్టన్‌ బ్యూరో చీఫ్‌ మైకేల్‌ షారెర్‌తో ట్రంప్‌ అన్నారు.

ఇంటర్వ్యూలో తన విధానాలను సమర్థించుకుంటూ మాట్లాడారు.  ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్‌ చేసిన ‘వైర్‌ ట్యాపింగ్‌’ ఆరోపణలకు సంబంధించిన అంశంపైనా టైమ్స్‌ ప్రశ్నలు అడిగింది. మాజీ అధ్యక్షుడు ఒబామా తన ఫోన్‌ను వైర్‌ట్యాప్‌ చేశారని ట్రంప్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే. అలాగే ఒబామా అభ్యర్థన మేరకు బ్రిటిష్‌ గూఢచర్య సంస్థ జీసీహెచ్‌క్యూ తన ప్రచారంపై నిఘా పెట్టిందని చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను కూడా ట్రంప్‌ సమర్థించారు. బ్రెగ్జిట్‌ సమయంలోనే తాను అది జరుగుతుందని చెప్పానని, అప్పుడు అందరూ నవ్వారని, అయితే అప్పుడు తాను చెప్పిందే జరిగిందని ట్రంప్‌ చెప్పుకొచ్చారు.

>
మరిన్ని వార్తలు