గుత్తి వాగులోకి దూసుకెళ్లిన కారు..

30 Jul, 2020 09:26 IST|Sakshi

కొట్టుకుపోతున్న యువకుల్ని రక్షించిన స్థానికులు

సాక్షి, అనంతపురం: కారు అదుపు తప్పి వాగులోకి దూసుకెళ్లిన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదం నుంచి ఇద్దరు యువకులు సురక్షితంగా బయటపడ్డారు. కడపకు చెందిన రాకేష్‌,రఫీ అనే యువకులు కడప నుంచి బీజాపూర్‌ వెళ్తుండగా, ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు దాటే క్రమంలో నీటి ప్రవాహానికి కారు కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో చిక్కుకున్న యువకులను స్థానికులు రక్షించారు. ప్రమాదం నుంచి సురక్షితంగా ఆ యువకులు బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

కారు ప్రమాదం తర్వాత వాగును దాటుతూ రోడ్డుపై ఆర్టీసీ బస్సు నిలిచిపోవడంతో తాళ్ల సాయంతో లారీ ద్వారా బస్సును స్థానికులు సురక్షిత ప్రాంతానికి తరలించారు. గుత్తి చెరువులో చిక్కుకున్న ఓ మత్స్యకారున్ని కూడా స్థానికులు కాపాడారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా