ఆన్‌లైన్‌లో లడ్డూల బుకింగ్‌ అవాస్తవం : టీటీడీ

13 Dec, 2022 09:22 IST|Sakshi

తిరుమల: టీటీడీ వెబ్‌సైట్‌ ద్వారా లడ్డూలు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవచ్చని సోషల్‌ మీడి­యాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. టీటీడీ వెబ్‌ సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో భక్తులు దర్శన టికెట్‌ బుక్‌ చేసుకునే సమయంలోనే పరిమితంగా అదనపు లడ్డూలు బుక్‌ చేసుకునే అవకాశం ఉందని పేర్కొంది. దర్శనంతో సంబంధం లేకుండా లడ్డూలు టీటీడీ వెబ్‌సైట్‌ ద్వారా బుక్‌ చేసుకోవచ్చని జరుగుతున్న ప్రచారాన్ని భక్తులు నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది. అవాస్తవ ప్రచారాలు చేస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

శ్రీవారి దర్శనానికి 24 గంటలు
తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూ కంపార్ట్‌మెంట్లు 14 నిండాయి. ఆదివారం అర్ధ­రాత్రి వరకు 72,466  మంది స్వామిని దర్శించుకోగా, 28,123 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి హుండీ కానుకల రూపంలో భక్తులు రూ.4.29 కోట్లు సమర్పించారు. దర్శన టోకెన్లు లేని భక్తులకు 24 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.

మరిన్ని వార్తలు