Supreme Court: అమరావతి కేసు విచారణ 28కి వాయిదా

14 Nov, 2022 17:03 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: అమరాతి కేసు విచారణను సుప్రీంకోర్టు 28కి వాయిదా వేసింది. విభజన కేసులను వేరుగా విచారించాలని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది సంఘ్వీ కోరారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించే అధికారం లేదన్న హైకోర్టు తీర్పును ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్‌లో కోరింది. రద్దు చేసిన చట్టాలపై తీర్పు ఇవ్వడం సహేతుకం కాదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

రాజ్యాంగం ప్రకారం మూడు వ్యవస్థలు తమ తమ అధికార పరిధుల్లో పని చేయాలి. శాసన, పాలన వ్యవస్థ అధికారాలలోకి న్యాయవ్యవస్థ చొరబడటం రాజ్యాంగ మౌలిక వ్యవస్థకు విరుద్ధం. తమ రాజధానిని రాష్ట్రాలే నిర్ణయించుకోవడం అనేది సమాఖ్య వ్యవస్థకు నిదర్శనం అని పిటిషన్‌లో పేర్కొన్నారు.
చదవండి: లోకేష్‌ వ్యవసాయం గురించి మాట్లాడటం మన కర్మ: మంత్రి కాకాణి 

మరిన్ని వార్తలు