జిల్లా పోలీస్‌ అబ్జర్వర్‌ రాక

9 Nov, 2023 05:56 IST|Sakshi
భూటియాకు మొక్కను అందజేస్తున్న సీపీ శ్వేత

సిద్దిపేటఅర్బన్‌: శాసనసభ ఎన్నికల సందర్భంగా జిల్లా పోలీస్‌ అబ్జర్వర్‌ సోనమ్‌ టెన్సింగ్‌ భూటియాను కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, సీపీ శ్వేత బుధవారం హరిత హోటల్‌ వద్ద స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎన్నికలు పారదర్శకంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి తీసుకుంటున్న చర్యలు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వర్క్‌, జిల్లా భౌగోళిక పరిస్థితుల గురించి కలెక్టర్‌, సీపీ వివరించారు.

విద్యాధరిలో పూజలు

వర్గల్‌(గజ్వేల్‌): గజ్వేల్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి తూంకుంట నర్సారెడ్డి బుధవారం నామినేషన్‌కు ముందు కుటుంబ సభ్యులతో కలిసి వర్గల్‌ విద్యాసరస్వతి క్షేత్రాన్ని సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితుల మహదాశీర్వచనం పొందారు. హారతి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ మోహన్‌ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు