అమెజాన్‌కు ఏమైంది? వారంలో మూడో బిజినెస్‌కు బై..బై..!

30 Nov, 2022 11:42 IST|Sakshi

భారత్‌లో అమెజాన్‌ డిస్ట్రిబ్యూషన్‌ మూసివేత

న్యూఢిల్లీ: భారత్‌లో తమ హోల్‌సేల్‌ విభాగంలోని అమెజాన్‌ డిస్ట్రిబ్యూషన్‌ను మూసివేస్తున్నట్లు ఈ–కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ వెల్లడించింది. అయితే, హోల్‌సేల్‌ బీ2బీ మార్కెట్‌ప్లేస్‌ మాత్రం యథాప్రకారం కొనసాగుతుందని పేర్కొంది. కార్యకలాపాల వార్షిక సమీక్షలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ప్రతినిధి తెలిపారు.(టీవీఎస్‌ అపాచీ స్పెషల్‌ ఎడిషన్‌, న్యూ లుక్‌ చూస్తే ఫిదానే!)

అమెజాన్‌ డిస్ట్రిబ్యూషన్‌ ప్రస్తుతం కర్ణాటకలోని మూడు జిల్లాల్లోని (బెంగళూరు, మైసూరు, హుబ్లి) చిన్న దుకాణాదారులకు పరిమిత స్థాయిలో సర్వీసులందిస్తోంది. ప్రస్తుత కస్టమర్లు, భాగస్వాములకు ఇబ్బందులు కలగకుండా దశలవారీగా అమెజాన్‌ డిస్ట్రిబ్యూషన్‌ను నిలిపివేయ నున్నట్లు అమెజాన్‌ ప్రతినిధి వివరించారు. ఇప్పటికే ఫుడ్‌ డెలివరీ, అమెజాన్‌ అకాడెమీ వ్యాపార విభాగాలను నిలిపి వేయాలని అమెజాన్‌ నిర్ణయం తీసుకోగా.. ఇది మూడోది కానుంది. (డీఎల్‌ఎఫ్‌కు షాక్‌: అదానీ చేతికి ‘ధారావి’ ప్రాజెక్టు)

మరోవైపు, క్లౌడ్‌ సర్వీసులకు సంబంధించి భారత మార్కెట్లో వృద్ధికి భారీగా అవకాశాలు ఉన్నాయని అమెజాన్‌ ఇంటర్నెట్‌ సర్వీసెస్‌ ప్రెసిడెంట్‌ (కమర్షియల్‌ బిజినెస్, ఏడబ్ల్యూఎస్‌ భారత్, దక్షిణాసియా విభాగం) పునీత్‌ చందోక్‌ తెలిపారు. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో కంపెనీలు మరింతగా క్లౌడ్‌ వైపు మళ్లగలవని తమ వార్షిక ’రీ:ఇన్వెంట్‌ 2022’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా  ఆయన చెప్పారు.  

మరిన్ని వార్తలు