స్విట్జర్లాండ్‌కు గుడ్ బై చెప్పిన ఆనంద్ మహీంద్రా.. ఎందుకో తెలుసా?

16 Jan, 2022 20:27 IST|Sakshi

దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆటోమొబైల్‌ దిగ్గజ కంపెనీ మహీంద్రా చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా సోషల్‌ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటూ సమకాలీన అంశాలపై స్పందిస్తారు అనే విషయం మన అందరికీ తెలిసిందే. పౌర సమాజంతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటూ అనేక అంశాలపై ప్రజలతో చర్చిస్తుంటారు. తాజాగా జమ్ము & కాశ్మీర్ కు సంబంధించిన కొన్ని చిత్రాలను తన ట్విటర్ వేదికగా షేర్ చేశారు.

మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆ ఫోటోలను షేర్ చేస్తూ..  "హలో శ్రీనగర్.. గుడ్ బై స్విట్జర్లాండ్" అని పేర్కొన్నాడు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం జమ్ము & కాశ్మీర్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో గతంతో పోలిస్తే ఇప్పుడు ఆ ప్రాంతాలు మరింత ఆకర్షణీయంగా కన్పిస్తున్నాయి. ఆనంద్‌ మహీంద్రా షేర్ చేసిన చిత్రాలలో ఆ ప్రాంతం పూర్తిగా మంచుతో కప్పబడి ఆహ్లాదంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఆ చిత్రాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఒక యూజర్ ఇలా రాశాడు.. "భారతదేశం పెద్ద టైకూన్ స్విట్జర్లాండ్ కంటే హిమాలయ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తే నేను నిజంగా అభినందిస్తున్నాను.. ఇది మా పర్యాటకాన్ని పెంచుతుంది.." అని అన్నారు.

(చదవండి: ఎస్‌బీఐ ఖాతాదారులకు సంక్రాంతి శుభవార్త..!)

మరిన్ని వార్తలు