Apple: సరికొత్త ఆఫర్‌...మనీ యాడ్‌ చేస్తే...20 శాతం బోనస్‌..!

17 Oct, 2021 17:58 IST|Sakshi

క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించి పునరావృత లావాదేవీలను ఆమోదించేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ కొత్త ప్రామాణీకరణ వ్యవస్థను అక్టోబర్‌ 1 నుంచి అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో సరికొత్త ప్రణాళికతో ఆపిల్‌ ముందుకొచ్చింది. ఆపిల్ ఐడి బ్యాలెన్స్( Apple ID Balance) ఉపయోగించి చెల్లింపులను ప్రోత్సహించమని టెక్ దిగ్గజం పలు డెవలపర్‌లను ​కోరినట్లు తెలిసింది.  
చదవండి: ఎలక్ట్రిక్ వెహికల్ చరిత్రను మార్చిన టెస్లా


యూజర్లు  తమ ఆపిల్ ఐడీకి నిధులను జోడిస్తే 20 శాతం బోనస్‌ని ఆపిల్‌ అందిస్తోంది. ఈ విషయాన్ని 9To5Mac ట్విటర్‌లో వెల్లడించింది. కాగా ఈ ఆఫర్‌ అక్టోబర్‌ 31 వరకు అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆపిల్‌ ఐడి బ్యాలెన్స్‌కు కనిష్టంగా రూ.100 నుంచి గరిష్టంగా 15 వేల వరకు డబ్బులను యాడ్‌ చేసుకోవచ్చును.

ఉదాహరణకు, ఒక ఆపిల్‌ యూజర్‌ Apple ID కి రూ .2,000 జోడిస్తే, వారు బోనస్‌గా రూ. 400 పొందుతారు. ఒక వేళ రూ. 10,000 అయితే, యూజర్‌ Apple ID లో అదనంగా రూ .2,000 పొందుతారు.  ఆపిల్ ఇన్-యాప్ కొనుగోలు వ్యవస్థతో సమస్యలను నివారించడానికి 20 శాతం బోనస్‌ని యూజర్లకు అందిస్తోంది. ఆపిల్‌ ఐడీ బ్యాలెన్స్‌ను వాడి ఇతర పేమెంట్స్‌ చేసే ఆప్షన్‌ కేవలం అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంది. 
చదవండి: ఐఫోన్‌13 ఎంట్రీతో షావోమీకు భారీ షాక్‌...!

మరిన్ని వార్తలు