ఎలక్ట్రిక్ స్కూటర్లకు పెరుగుతున్న డిమాండ్

3 Mar, 2021 18:59 IST|Sakshi

దేశంలో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రదేశాలలో పెట్రోలా ధర సెంచరీ కూడా కొట్టేసింది. రోజు రోజుకి పెట్రోల్ ధరలు పెరుగుతుండటంతో ప్రజలు ప్రత్యామ్నాయ వాహనాల కోసం ఎదురు చూస్తున్నారు. పెరుగుతున్న ఇంధన ధరల కారణంగా ఈ సైకిళ్లు, ఎలక్ట్రిక్ స్కూటర్ల, ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం రోజు రోజుకి అక్కడ పెరిగిపోతుంది. మన దేశంలో కూడా ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ బాగా పెరిగింది.

గత రెండు నెలల్లోనే ఈ సైకిళ్ల అమ్మకాలు 10 నుంచి 15 శాతం వరకూ పెరిగినట్లు అవాన్ సైకిల్స్ ఎండీ తెలిపారు. వచ్చేవారం నుంచి ఈ బైక్స్ ఉత్తరాదిలో కూడా అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. మెట్రో నగరాల్లో భారీగా పెరుగుతున్న ట్రాఫిక్ కూడా ఈ బైక్ విక్రయాలు పెరగడానికి ఒక కారణంగా తెలుస్తోంది. త్వరలో ఈ బైక్స్ అమ్మకాల్లో వంద శాతం వృద్ధిని అందుకుంటామని హీరో సైకిల్స్ అంచనా వేస్తోంది. మరోవైపు గత 2-3 నెలలుగా ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్లు ఎలక్ట్రిక్ వాహన సంస్థలు తెలిపాయి. ఇంట్లో అవసరాలకు కోసం ఎలక్ట్రిక్ స్కూటర్లు అనువుగా ఉండటమే కాకుండా పెట్రోల్ నుంచి విముక్తి పొందడంతో ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. 

మరిన్ని వార్తలు