స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

23 Apr, 2021 17:05 IST|Sakshi

కొద్దీ రోజుల నుంచి భారీగా పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. నేడు స్వల్ప స్థాయిలో బంగారం ధరలు తగ్గాయి. ఏప్రిల్ 1న రూ.46,152 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.47, 615కు చేరుకుంది. భవిష్యత్ లో ఇంకా బంగారం ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,615గా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.250 తగ్గింది. ఇక ఆభరణాల తయారీలో ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,843 నుంచి రూ.43,615కు తగ్గింది.  

ఇక తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మార్కెట్లో కూడా బంగారం ధరలు తగ్గాయి. నేడు ఆభరణాల తయారీలో ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,100 నుంచి రూ.44,800కు తగ్గింది. అంటే మూడు వందల రూపాయలు తగ్గింది అన్నమాట. ఇక పెట్టుబడులు పెట్టేందుకు వాడే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.330 తగ్గి 48,870 రూపాయలకు చేరుకుంది. ఏపీలోని విజయవాడలో కూడా ఇవే బంగారం ధరలు ఉన్నాయి. బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా తగ్గాయి. నేడు వెండి ధర రూ.69,966 నుంచి రూ.69,075కు చేరుకుంది. 

చదవండి: 

గుడ్ న్యూస్: అందుబాటులోకి మరో వ్యాక్సిన్

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు