-

Google Pixel: స్మార్ట్‌ ఫోన్‌లో కొత్త సమస్య, బాబోయ్‌ వద్దంటూ ఫిర్యాదుల వెల్లువ

23 Oct, 2021 19:41 IST|Sakshi

గూగుల్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా టెన్సార్‌ చిప్‌సెట్‌లతో పాటు ఆండ్రాయిడ్‌12 వెర్షన్‌తో పిక్సెల్‌ 6, పిక్సెల్స్‌ 6 ప్రో ఫోన్‌లను విడుదల చేసింది. ఇప్పుడు ఆ ఫోన్‌లపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. 

అక్టోబర్‌ 19న గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ ఫిక్సెల్‌ ఫోన్‌లను విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సాధారణంగా ఫోన్‌లలో ఉండే చిప్‌ సెట్లను క్వాల్కమ్‌ తయారు చేస్తుంది. అయితే పిక‍్సెల్‌ ఫోన్‌లలో వినియోగించిన చిప్‌లను గూగులే సొంతంగా తయారు చేసింది. ఈ పిక్సెల్‌ 6 ప్రారంభ ధర మన కరెన్సీలో రూ.44,971వేలు, పిక్సెల్‌ ప్రొ ధర  దాదాపు రూ.67,494గా ఉంది. 

అయితే విడుదల సందర్భంగా ఈ సిరీస్‌ ఫోన్లను కొనుగోలు చేసిన వినియోగదారులు పిక్సెల్‌ సపోర్ట్‌కు పేజ్‌కు వరుసగా ఫిర్యాదు చేస్తున్నారు. తాము కొనుగోలు చేసిన పిక్సెల్‌ ఫోన్‌లలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నట్లు తెలిపారు. అన్‌లాకింగ్‌, యాప్స్‌ క్రాష్‌, కెమెరాలలో సమస్యలున్నాయని, ఫోన్‌ రీస్టార్ట్‌ చేసినా అవి పరిష్కారం కావడం లేదని, ఆండ్రాయిడ్ 12 వెర్షన్‌ని ఇన్‌స్టాల్ చేసిన పిక్సెల్ ఫోన్‌లలో ఎటువంటి మార్పులు లేవని అన్నారు.

మరికొందరు ఆండ్రాయిడ్ వెర్షన్‌కి మారిన తర్వాత యాప్‌లు క్రాష్ అవున్నట్లు చెప్పారు. బ్యాటరీ డ్రెయిన్ సమస్యల్ని ఫేస్‌ చేస్తున్నట్లు, త్వరగా ఈ సమస్యలకు పరిష్కారం చూపించాలని కోరుతున్నారు. పిక్సెల్‌ 6 సిరీస్‌తో పాటు పిక్సెల్ 4ఏ, పిక్సెల్ 4ఏ 5జీ, పిక్సెల్5 ఫోన్‌లలో సమస్యలు ఉన్నాయని నెటిజన్లు ట్వీట్‌ చేస్తున్నారు. ఇక యూజర్ల వరుస ఫిర్యాదులతో గూగుల్‌ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.

చదవండి: గూగుల్‌ పిక్సెల్‌ 6 సిరీస్‌: సొంత చిప్‌తోనే అదిరిపోయే ఫీచర్లు, ధర ఎంతంటే..

మరిన్ని వార్తలు