గుడ్‌ న్యూస్‌: డీజిల్‌ ఎగుమతులపై విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ కోత

4 Aug, 2022 12:18 IST|Sakshi

ఏటీఎఫ్‌ ఎగుమతులపై పన్ను రద్దు

దేశీయంగా క్రూడాయిల్ ఉత్పత్తిపై పన్ను పెంపు

సాక్షి, న్యూఢిల్లీ: విండ్‌ఫాల్‌ టాక్స్‌  వడ్డింపుపై కేంద్రం మరోసారి కిలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఇటీవల విధించిన విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌పై తాజాగా కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. డీజిల్‌ ఎగుమతులపై విండ్‌ఫాల్ పన్నును సగానికి తగ్గించింది. అలాగే జెట్ఇంధనం (ఏటీఎఫ్‌) ఎగుమతులపై టాక్స్‌ను రద్దు చేసింది. అయితే దేశీయంగా ఉత్పత్తయ్యే ముడి చమురుపై పన్నును పెంచింది.   (Fortune Global 500: రిలయన్స్‌ హైజంప్‌, ర్యాంకు ఎంతంటే?)

అధికారిక నోటిఫికేషన్ ప్రకారం డీజిల్ ఎగుమతిపై పన్ను లీటరుకు రూ.11 నుంచి రూ.5కు తగ్గించారు. విమాన ఇంధనం (ఏటీఎఫ్‌)పై లీటరుకు రూ.4 పన్నును తొలగించింది. దీంతో డీజిల్‌ లీటర్‌పై విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ను రూ.11 నుంచి రూ.6 కు దిగి వచ్చింది. దేశీయంగా ఉత్పత్తి చేయబడే ముడి చమురుపై పన్ను టన్నుకు రూ. 17,000 నుండి రూ.17,750కి పెంచింది.పెట్రోల్‌ ఎగుమతులపై విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ జీరోగా కొనసాగుతుంది. క్రూడాయిల్‌పై పన్ను పెంపుద్వారా ఓఎన్‌జీసీ, వేదాంత లాంటి ఉత్పత్తి దారులకు కష్ట కాలమేనని, అలాగే డీజిల్‌, ఏటీఎఫ్‌లపై పన్నుల కోత  రిలయన్స్‌ కు సానుకూలమని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. 

(ఇదీ చదవండి:నెలకు 4వేల జీతంతో మొదలైన‘హీరో’, కళ్లు చెదిరే ఇల్లు,కోట్ల ఆస్తి..చివరికి!)

చమురు ఉత్పాదక సంస్థలు, పెట్రో ఎగుమతి కంపెనీలు ఇబ్బడి ముబ్బడిగా లాభాలు ఆర్జిస్తున్నాయన్న కారణంతో జూలై 1న కేంద్రం విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ను విధించిన సంగతి తెలిసిందే. జూన్‌లో 26.18 బిలియన్ల డాలర్లుగా ఉన్న వాణిజ్య లోటు ఎగుమతులు మందగించడంతో  జూలై నెలలో 31 బిలియన్‌ డాలర్ల రికార్డుస్థాయికి చేరిన నేపథ్యంలో తాజాగా విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ను ప్రభుత్వం సవరించింది. జూలై 20న ఆ పన్నులను కొంతమేర తగ్గించిన కేంద్రం మరోసారి సారి కోత పెట్టింది. ఎగుమతులు, దిగుమతుల మధ్య అంతరం నుండి జూలైలో  రికార్డుస్థాయికి చేరిన నేపథ్యంలో రెండోసారి విండ్‌ఫాల్‌ టాక్స్‌ను తగ్గించింది. కమోడిటీ ధరలు పెరగడం, బలహీనమైన రూపాయి కారణంగా జూలైలో దిగుమతులు 43.59 శాతం పెరగగా, ఎగుమతులు 0.76 శాతం పడిపోయాయి.

మరిన్ని వార్తలు