ఈ హైపర్ ఎలక్ట్రిక్ కారు ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

1 Dec, 2021 21:05 IST|Sakshi

Project Deepspace: అమెరికాకు చెందిన ప్రముఖ వాహన తయారీదారు సంస్థ హెన్నెస్సీ తన తొలి ఎలక్ట్రిక్ వాహనాన్ని తయారు చేయడానికి సుమారు 3 మిలియన్ డాలర్లు(సుమారు రూ.22 కోట్లు) ఖర్చు కానున్నట్లు తెలిపింది. ఇది చూడాటానికి ఒక గ్రహాంతర అంతరిక్ష నౌకలాగా కనిపిస్తుంది అని కంపెనీ పేర్కొంది. ఈ కారులో మరో ప్రత్యేకత ఏంటి అంటే? దీనికి 6 చక్రాలు ఉండనున్నాయి. ప్రైవేట్ జెట్ ఇంటీరియర్ గల ఈ కారు ఆరు ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ మోటార్లు సహాయంతో నడుస్తుంది. ఈ సిక్స్ వీల్ డ్రైవ్ ఆల్ ఎలక్ట్రిక్ హైపర్ కారుకు కంపెనీ 'ప్రాజెక్ట్ డీప్ స్పేస్' అని కోడ్ పేరు పెట్టింది. 

కంపెనీ రాబోయే ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన కొన్ని డిజైన్ స్కెచ్ లను ఆవిష్కరించింది. ఈ డిజైన్ చూడాటానికి పవర్ ఫుల్ కారులాగా కనిపిస్తుంది. ఈ వాహనంలో నాలుగు చోట్ల డైమండ్ సీటింగ్, ప్రైవేట్ జెట్ క్లాస్ ప్రీమియంనెస్ ఉంటాయి. దీని డ్రైవర్ సీటు నడి మధ్యలో ఉంటుంది. వెనుక సీటు వెనుక భాగంలో ఫ్లాట్ గా పడుకోవడానికి తగినంత ప్లేస్ ఉంటుంది. ఈ డీప్ సీని అల్ట్రా లైట్ వెయిట్ కార్బన్ ఫైబర్ ఛాసిస్, బాడీ ప్యానెల్స్ తో నిర్మించనున్నారు. ఈ కారును ఎక్కువ సంఖ్యలో మార్కెట్లోకి తీసుకొని రారు, ప్రతి కస్టమర్ ప్రాధాన్యతకు అనుగుణంగా దీనిని కస్టమైజ్ చేస్తారు. 

ఈ వాహనం ఫీచర్స్ పూర్తిగా అందుబాటులో లేవు. కానీ, ఇది శక్తి పరంగా 2,000 హార్స్ పవర్కి శక్తి ఇస్తుందని,  అలాగే గంటకు 320 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో దూసుకెళ్లనున్నట్లు కంపెనీ తెలిపింది. అయితే, అత్యంత వేగవంతమైన కారుగా పోటీలో ప్రవేశించాలని కంపెనీ భావించడం లేదు. అలాగే, కంపెనీ కేవలం ప్రపంచం మొత్తం మీద 105 కార్లను తయారు చేయనున్నట్లు తెలిపింది. ఈ కారును 2026 నాటికి అందుబాటులోకి తీసుకొని రానున్నట్లు కంపెనీ తెలిపింది. 

(చదవండి: స్పేస్‌ ఎక్స్‌ దివాళా..! ఉద్యోగులకు ఎలన్‌ మస్క్‌ వార్నింగ్‌..!)

మరిన్ని వార్తలు