అయోధ్య చేరుకోనున్న మొదటి ఫ్లైట్ ఇదే.. ఎప్పుడో తెలుసా?

14 Dec, 2023 19:38 IST|Sakshi

అయోధ్య రామమందిరం ప్రారంభ ఏర్పాట్లతో పాటు ఎయిర్‌పోర్టు పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 22న శ్రీరామునికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నట్లు ఇప్పటికే తెలిసింది. అంతకంటే ముందు అయోధ్య విమానాశ్రయంలో డిసెంబర్ 30న మొదటి విమానాన్ని నడపనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

దేశ రాజధాని ఢిల్లీ నుంచి అయోధ్య విమానాశ్రయానికి డిసెంబర్ 30న తొలి విమానాన్ని నడపనున్నట్లు ఇండిగో ప్రకటించింది. అయోధ్యలోని మర్యాద పురుషోత్తం శ్రీరామ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ నెలాఖరులోగా సిద్ధమవుతుందని, ప్రధాని నరేంద్ర మోదీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇటీవల వెల్లడించారు.

ఢిల్లీ - అయోధ్య మధ్య
2024 జనవరి 10 నుంచి ఇండిగో విమానాలు ఢిల్లీ నుంచి అయోధ్యకు ప్రతి రోజు తిరిగే అవకాశం ఉంది. ఢిల్లీ నుంచి ఉదయం 11:55 గంటలకు బయలుదేరి 1:15 గంటలకు అయోధ్యకు చేరుతుంది. ఆ తరువాత 1:45 గంటలకు అయోధ్య నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3:00 గంటలకు ఢిల్లీలో ల్యాండ్ అవుతుంది. ప్రతి రోజూ ఇదే షెడ్యూల్‌లో విమానాలు నడుస్తాయి.

ఇదే చదవండి: అనిల్ అంబానీ ఆస్తులు అమ్మకానికి గ్రీన్ సిగ్నల్.. జాబితాలో ఉన్నవేంటో తెలుసా?

ఢిల్లీ - అహ్మదాబాద్ మధ్య
అహ్మదాబాద్ నుంచి మంగళవారం, గురువారం, శనివారం మాత్రమే విమానాలు అయోధ్యకు చేరుకుంటాయి. ఈ రోజుల్లో ఉదయం 9:10 గంటలకు బయలుదేరి 11:00 గంటలకు అయోధ్యకు చేరుకుంటుంది. ఆ తరువాత 11:30 గంటలకు అయోధ్య నుంచి ప్రారంభమై మధ్యాహ్నం 1:40 గంటలకు అహ్మదాబాద్ చేరుకునే అవకాశం ఉంది.

 

>
మరిన్ని వార్తలు