ఇండిగో పెయింట్స్‌ ఐపీవో బాట

13 Nov, 2020 10:59 IST|Sakshi

సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు

రూ. 1,000 కోట్ల సమీకరణ లక్ష్యం

సీక్వోయా క్యాపిటల్‌ వాటా విక్రయం

విస్తరణకు, రుణ చెల్లింపులకు నిధుల వినియోగం

ముంబై: పీఈ దిగ్గజం సీక్వోయయా క్యాపిటల్‌ అండగా దేశీ మార్కెట్లో కార్యకలాపాలు విస్తరించిన ఇండిగో పెయింట్స్‌ పబ్లిక్‌ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుమతించమంటూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి దరఖాస్తు చేసింది. ఐపీవోలో భాగంగా సీక్వోయా క్యాపిటల్‌ 58.4 లక్షల షేర్లను విక్రయానికి ఉంచనుంది. అంతేకాకుండా వీటికి అదనంగా రూ. 300 కోట్ల విలువచేసే ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. ప్రమోటర్‌ హేమంత్‌ జలాన్‌ సైతం కొంతమేర వాటాను విక్రయించనున్నారు. తద్వారా కంపెనీ రూ. 1,000 కోట్లను సమీకరించే యోచనలో ఉంది. చదవండి: చదవండి: (ఐపీవోలకు తొందరపడుతున్న కంపెనీలు)

ప్రాస్పెక్టస్‌ ప్రకారం ఇండిగో పెయింట్స్‌ ఐపీవో నిధులను కంపెనీకున్న తయారీ ప్లాంట్ల విస్తరణకు ప్రధానంగా వినియోగించనుంది. తమళినాడులోని పుదుకొట్టాయ్‌లోగల ప్లాంటు తయారీ సామర్థ్యాన్ని పెంచనుంది. మరికొన్ని నిధులను రుణ చెల్లింపులకూ వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో కంపెనీ పేర్కొంది. పుణేకు చెందిన ఇండిగో పెయింట్స్‌ ప్రధానంగా వివిధ డెకొరేటివ్‌ పెయింట్లను రూపొందిస్తోంది. దేశవ్యాప్తంగా పంపిణీ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. కంపెనీకి తమిళనాడు, రాజస్తాన్‌, కేరళలలో మొత్తం మూడు తయారీ యూనిట్లు ఉన్నాయి. పబ్లిక్‌ ఇష్యూకి కొటక్‌ మహీంద్రా క్యాపిటల్‌, ఎడిల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ బుక్‌రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్స్‌గా వ్యవహరించనున్నాయి. చదవండి:(గ్లాండ్ ఫార్మా ఐపీవో సోమవారమే)

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు