చంద్రుడిపై రొమాన్స్‌.. రూ.158 కోట్లు నష్టం!

13 Oct, 2021 20:12 IST|Sakshi

స్పేస్‌ ఎక్స్‌ అధినేత ఎలన్‌ మస్క్‌ పుణ్యమా అంటూ ప్రస్తుతం స్పేస్‌, మార్స్‌, శాటిలైట్‌ పేర్లు ప్రముఖంగా వినబడుతున్నాయి. అందుకు సంబంధించిన వార్తలు వైరల్‌ అవుతున్నాయి. తాజాగా ఓ వార్త ఇలాగే నెట్టింట్లో హల్‌ చల్‌ చేస్తోంది. 2002 నేషనల్ ఏరోనాటిక్స్, స్పేస్ అడ్మినిస్ట్రేషన్ సంస్థ 'నాసా'లో జరిగిన ఓ సంఘటన తాజాగా జరిగినట్లు సోషల్‌ మీడియాలో చక్కెర్లు కొట్టడం ఆసక్తికరంగా మారింది. 

అమెరికాకు చెందిన థాడ్ రాబర్ట్స్ చంద్ర మండలంపై కాలు మోపి, అక్కడ ప్రయోగాలు చేయాలనే కోరిక ఉండేది. కోరికకు తగ్గట్లు అదృష్టం వరించింది. నాసా లూనార్ ల్యాబ్‌లో శిక్షణ పొందే అవకాశం లభించింది. అక్కడ వ్యోమగాములుగా శిక్షణ పొందితే ఏదో ఒకరోజు స్పేస్‌లో అడుగపెట్టే అవకాశం లభిస్తుంది. కానీ థాడ్‌లోని సె**కోరికలు ఆ అవకాశాన్ని దూరం చేశాయి. నాసాలో ట్రైనింగ్‌ తీసుకుంటుండగా.. అదే ల్యాబ్‌లో పనిచేసే ప్రియురాలు 'టిఫనీ ఫౌలర్'తో ఏకంగా చంద్రుడి మీద తన 'కోరిక' తీర్చుకోవాలని అనుకున్నాడు. కానీ అందుకు నాసా అంగీకరించదు? మరేం ఏం చేయాలి? అని అనుకున్నాడు. అప్పుడే థాడ్‌లో దుర్భుద్ది పుట్టింది.
   
101 గ్రాముల రాళ్లు, దూళిపై.. 


ఆ దుర్భుద్ది మనసును తొలిచేస్తున్నా నాసా ఇచ్చే ట్రైనింగ్‌లో పాల్గొనేవాడు. అదే సమయంలో నాసా చంద్ర మండలం నుంచి 101 గ్రాముల రాళ్లు, దూళిని కిందకు తెచ్చిందని, వాటిని అమ్మితే కోటీశ్వరులు కావొచ్చని తెలుసుకున్నాడు. అంతే చంద్రమండలంలో తన కోరికను తీర్చుకోలేడు కాబట్టి.. నాసా కేంద్రంలో ఉన్న రాళ్లు, దూళిని దొంగిలించి వాటిపై శృంగారం చేయాలని అనుకున్నాడు. అనుకున్నదే తడువుగా తన ప్లాన్‌ను తన ప్రియురాలికి చెప్పడంతో ఆమెకూడా అందుకు అంగీకరించింది. పనిలో పనిగా  రాళ్లను, దూళిని అమ్మి సొమ్ము చేసుకునేందుకు బెల్జియంకు చెందిన సైంటిస్ట్‌తో తనని తాను ఆర్బ్ రాబిన్సన్గా పరిచయం చేసుకున్నాడు. చంద్రుడి రాళ్లను అమ్మేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. గ్రాముకు రూ.5 వేల డాలర్లు  భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ.3.70 లక్షలు చెల్లించేందుకు ఆ శాస్త్రవేత్త అంగీకరించాడు.   

సె** ఆన్ ది మూన్’..


తన ప్లాన్‌లో భాగంగా చంద్రుడి రాళ్లను నాసా కేంద్రంలో ఎక్కడ భద్రపరిచారో తెలుసుకున్నాడు. వాటిని దొంగిలించేందుకు తన స్నేహితులు సాయం తీసుకున్నాడు. అనుకున్న ప్రకారం సేఫ్టీ లాకర్‌ను బద్దలు కొట్టి అందులో ఉన్న రాళ్లను, దూళిని దొంగిలించాడు. చివరికి ‘సె** ఆన్ ది మూన్’ పేరుతో ఓ హోటల్‌లో తన ప్రియురాలితో కోరిక తీర్చుకున్నాడు. అనంతరం రాళ్లు, దూళి బరువు ఎక్కువగా ఉంటే డబ్బు ఎక్కువగా వస్తుందని.. వాటిని కల్తీ చేశాడు. 

నాసాకు కోట్లలో నష్టం..   


అనంతరం ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా సైంటిస్ట్‌కు అమ్మేందుకు ఓ ప్రాంతానికి వచ్చాడు. అప్పటికే థాడ్‌ రాబర్ట్స్ చేసిన దొంగతనం గురించి సమాచారం అందుకున్న ఫెడర్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. థాడ్‌ రాబర్ట్స్‌ చేసిన చెత్త పనివల్ల నాసా రూ.157 కోట్లు విలువ చేసే చంద్రుడి దూళిని కోల్పోయింది. ఈ దొంగతనంపై విచారణ చేపట్టిన కోర్టు నిందితుడికి  8ఏళ్లు జైలు శిక్ష విధించడంతో చివరికి కటకటాల పాలయ్యాడు.   

చదవండి: Moon Rover Motorcycle: చంద్రుడిపై నడిచే బైక్‌...! ఓ లుక్కేయండి...!

మరిన్ని వార్తలు