రూ. 30వేల కోట్ల సంపదకు అధిపతి - ఎవరీ లీనా తివారీ?

8 Apr, 2023 18:23 IST|Sakshi

ఫోర్బ్స్ (Forbes) యాన్యువల్ బిలినియర్స్ జాబితాను 2023 ఏప్రిల్ 04న విడుదల చేసింది. ఇందులో రిలయన్స్ సంస్థ ఛైర్మన్ ముఖేష్ అంబానీ భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో ఒకరుగా ఉన్నారు. ఈ లిస్ట్‌లో మొత్తం 16 మంది భారతీయలు ఉండటం గమనార్హం.

ఫోర్బ్స్ జాబితా ప్రకారం, భారతదేశంలో అత్యంత సంపన్నులైన మహిళలుగా ఐదు మందిని గుర్తించారు. వీరిలో సావిత్రి జిందాల్, రోహికా సైరస్ మిస్త్రీ, రేఖా జున్‌జున్‌వాలా, వినోద్ రాయ్ గుప్తాతో పాటు 'లీనా తివారీ' కూడా ఉన్నారు.

భారతదేశంలోని సంపన్న మహిళల జాబితాలో ఒకరుగా నిలిచినా 'లీనా' గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ ఆమె ప్రముఖ ఫార్మా కంపెనీకి వారసురాలు. అంతే కాకుండా ఈమె ప్రైవేట్ కంపెనీ USV ఇండియా చైర్‌పర్సన్ కూడా. లీనా ప్రస్తుత నికర సంపద విలువ 3.7 బిలియన్ డాలర్లు (భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 30,000 కోట్లకంటే ఎక్కువ).

(ఇదీ చదవండి: చిన్న గ్రామం.. చెట్ల కింద చదువు: ఇప్పుడు అమెరికాలో సంపన్న భారతీయుడు!)

కార్డియోవాస్కులర్ అండ్ డయాబెటిక్ మెడిషన్స్ విభాగాలలో లీనా ఫార్మా కంపాంట్ భారతదేశంలో మొదటి ఐదు స్థానాల్లో ఒకటిగా ఉంది. ఇది యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రేడియంట్స్, ఇంజెక్టబుల్స్ అండ్ బయోసిమిలర్ ఔషధాలను కూడా తయారు చేస్తుంది. గ్లైకోమెంట్ అని పిలువబడే USV యాంటీ-డయాబెటిక్ ఫార్ములేషన్ దేశీయ పరిశ్రమలో టాప్-3లో ఉంది.

ముంబై యూనివర్సిటీ నుంచి బీకామ్, బోస్టన్ యూనివర్సిటీ నుంచి MBA పూర్తి చేసిన లీనా తివారీ ఎక్కువగా బుక్స్ చదవటానికి ఆసక్తి చూపుతారు. అంతే కాకుండా ఈమె 'బియాండ్ పైప్స్ & డ్రీమ్స్ - ది లైఫ్ ఆఫ్ విఠల్ బాలకృష్ణ గాంధీ' పేరుతో బుక్ కూడా రాసింది. లీనా యుఎస్‌వి ఎండి ప్రశాంత్ తివారీని వివాహం చేసుకుంది. ఈయన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), యుఎస్‌లోని కార్నెల్ యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ చదివారు. వీరికి అనీషా గాంధీ తివారీ అనే కుమార్తె కూడా ఉంది.

మరిన్ని వార్తలు