రిలయన్స్‌ ఇండస్ట్రీస్ చేతికి మరో కంపెనీ

23 Apr, 2021 15:30 IST|Sakshi

బిలియనీర్ ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్.. బ్రిటన్‌కు చెందిన లిమిటెడ్ స్టోక్ పార్కును 79 మిలియన్ల డాలర్లకు కొనుగోలు చేసింది. హోటల్‌తో పాటు గోల్ఫ్‌ కోర్స్‌ కలిగిన స్టోక్‌ పార్క్‌ను సొంతం చేసుకుంది. దీంతో రిలయన్స్‌ హాస్పిటాలిటీ ఆస్తుల్లో ఇకపై స్టోక్స్‌ పార్క్‌ కూడా భాగం కానుంది. 1964 బ్లాక్ బస్టర్ మూవీలో జేమ్స్ బాండ్, ఆరిక్ గోల్డ్ ఫింగర్‌తో కలిసి గోల్ఫ్‌ కోర్స్‌ ఆట ఆడినప్పటి నుంచి రోలింగ్ గోల్ఫ్ కోర్సు భాగ ఫేమస్ అయ్యింది.

ముఖేష్ అంబానీ తన సామ్రాజ్యాన్ని ఇంధనేతర రంగంలోకి విస్తరిస్తున్న తరుణంలో 2019లో బ్రిటిష్ బ్రాండ్ అయిన ప్రముఖ ఆటబొమ్మల సంస్థ హామ్లిస్‌ను కొనుగోలు చేశారు. దీంతో భారత మార్కెట్లో మెరుగైన అవకాశాలు ఉన్న ఈ రంగంలోకి హామ్లిస్‌తో ప్రవేశించాలని రిలయన్స్‌ యోచిస్తోంది. గత ఏడాది రిలయన్స్ రిటైల్ & డిజిటల్ యూనిట్లలో ఉన్న వాటాను విక్రయించిన తర్వాత వచ్చిన 27 బిలియన్ డాలర్ల తాజా మూలధనంతో వినియోగ ఆధారిత సేవా రంగాలపై ముకేశ్‌ దృష్టి సారించారు. అందులో భాగంగానే జియో పేరిట టెలికాం రంగంతో పాటు హాస్పిటాలిటీ సెక్టార్‌లోకి ప్రవేశించారు.

చదవండి:

2021లో టీవీఎస్​ ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాల జోరు!

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు