ఎస్‌బీఐ మెగా ఆఫర్‌: మార్కెట్‌ రేటు కంటే తక్కువకే

4 Mar, 2021 14:44 IST|Sakshi

మార్చి 5న మెగా ఈ-వేలం

మార్కెట్‌ రేటు కంటే తక్కువకే   ఆస్తిని బిడ్డర్లు సొంతం చేసుకోవచ్చు : ఎస్‌బీఐ

బిడ్‌ వేయండి, కొనండి.. కలను సాకారం చేసుకోండి!

సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంకు  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)  మరోసారి  బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది.  మార్కెట్ రేట్ల కంటే చాలా తక్కువ ధరకే  కొత్త ఆస్తిలను కొనుగోలు చేసే అవకాశాన్ని ప్రజలకు  అందిస్తోంది. ఈ మేరకు మార్చి 5 న మెగా ఇ- వేలం  నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. రుణ ఎగవేతదారుల తనఖా ఆస్తులను విక్రయించడానికి ఈ-వేలం నిర్వహిస్తుంది. తద్వారా బకాయిలను తిరిగి పొందనుంది.  ఈ వేలంలో  నివాస,  వాణిజ్య ఆస్తులు  భూమి, వాహనాలు, యంత్రాలు, తదితరాలను  తక్కువ ధరకే  సొంతం చేసుకోవచ్చని ఎస్‌బీఐ ట్విటర్‌ ద్వారా వెల్లడించింది.  ఈ వేలం కోసం జారీ చేసిన పబ్లిక్ నోటీసులలో సంబంధిత వివరాలను అందించినట్టు తెలిపింది. (రెడ్‌మి నోట్‌ 10 స్మార్ట్‌ఫోన్లు వచ్చేసాయ్‌!)

వేలంలోని ఆస్తి వివరాలను ఎలా పొందాలి?
దీనికి సంబంధించి కొన్ని లింక్‌లను అందుబాటులో ఉంచింది. అలాగే ఆయా బ్రాంచ్‌లలో సంబంధింత సమాచారాన్ని అందించేందుకు ఒక ఉద్యోగి ప్రత్యేకంగా అందుబాటులో  ఉంటారు.  తద్వా వేలం వేయనున్న ప్రాపర్టీ వివరాలు, వేలం ప్రక్రియ, వివరాలను కొనుగోలుదారులు తెలుసుకోవచ్చని  బ్యాంక్ పేర్కొంది.

ఇ-వేలంలో పాల్గొనేందుకు అర్హత
దీనికి బిడ్డర్లు కొన్ని ఫార్మాలిటీలను ముందుగానే పూర్తి చేయాలి. నోటీసులో పేర్కొన్న విధంగా నిర్దిష్ట ఆస్తి  కొనుగోలుకు నిర్దేశిత సొమ్మును చెల్లించాలి. కేవైసీ పత్రాలు సంబంధిత శాఖకు సమర్పించాలి. చెల్లుబాటు అయ్యే డిజిటల్ సంతకాన్ని ఇవ్వాలి. ఇందుకు బిడ్డర్లు ఇ-వేలం వేసేవారిని లేదా మరే ఇతర అధీకృత ఏజెన్సీని సంప్రదించవచ్చు.  ఈఎండీ డిపాజిట్‌ , కేవైసీ పత్రాలు అందించిన అనంతరం లాగిన్ ఐడీ,  పాస్‌వర్డ్ బిడ్డర్ల ఇమెయిల్  పంపిస్తారు. దీంతో వేలం నిబంధనల ప్రకారం ఇ-వేలంలో పాల్గొనే అవకాశం లభిస్తుంది.

మరిన్ని వార్తలు