ఇన్ఫోసిస్‌లో వాటాను విక్రయించిన శిబులాల్‌

25 Jul, 2020 15:34 IST|Sakshi

ఇన్ఫోసిస్‌ సహ-వ్యవస్థాపకుడు ఎస్‌డీ శిబులాల్‌ కుటుంబ సభ్యులు కంపెనీలో కొంత వాటాను విక్రయించారు. గడచిన 3సెషన్లలో 0.20శాతం వాటాకు సమానమైన 8.5మిలియన్ల ఈక్విటీ షేర్లను రూ.786 కోట్లకు విక్రయించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. సిటీ గ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఈ అమ్మకానికి మధ్యవర్తిత్వం వహించింది. వాటా విక్రయం ద్వారా వచ్చే ఆదాయాన్ని దాతృత్వం, పెట్టుబడి కార్యకలాపాలకు వినియోగిస్తామని శిబులాల్‌ సభ్యులు తెలిపారు. ఇన్ఫోసిస్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ శుక్రవారం మార్కెట్‌ ముగిసే సరికి రూ.3.92లక్షల కోట్లుగా ఉంది. ఎస్‌డీ శిబులాల్‌ కుటుంబానికి జూన్‌ 30నాటికి 17లక్షల కోట్ల విలువకు సమానమైన 0.4శాతం వాటాను కలిగి ఉన్నారు. శిబులాల్‌ 2011-14 కాలంలో ఇన్ఫోసిస్‌కు సీఈవో, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా సేవలు అందించారు. అంతుకు ముందు 2007-11 మధ్యకాలంలో ఇన్ఫోసిస్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌గా పనిచేశారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్ చైర్మన్‌గా ఉన్న టెక్నాలజీ స్టార్టప్‌ ఆక్సిలర్ వెంచర్స్ పెట్టుబడులు పెట్టారు.

మరిన్ని వార్తలు