టెక్ దిగ్గజ సీఈఓలకు పద్మభూషణ్ అవార్డ్స్..!

25 Jan, 2022 20:50 IST|Sakshi

న్యూఢిల్లీ: రిపబ్లిక్‌ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. మొత్తం 128 మందికి పద్మ అవార్డులకు రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించింది. సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌కు పద్మ విభూషణ్‌ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. టాటా గ్రూప్ చైర్ పర్సన్ నటరాజన్ చంద్రశేఖర్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎండి సైరస్ పూనావాలాలకు పద్మభూషణ్ పురస్కారం ప్రకటించింది. అలాగే, కొవాగ్జిన్‌ టీకా తయారీ సంస్థ భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ ఎల్లా, సహ వ్యవస్థాపకులు సుచిత్ర ఎల్లాకు పద్మభూషణ్ పురస్కారం అనౌన్స్‌ చేసింది. 

ట్రేడ్ & ఇండస్ట్రీ రంగానికి చెందిన ఐదుగురికి పద్మభూషణ్ అవార్డ్స్ లభించడంతో పాటు ఇద్దరికీ పద్మశ్రీ పురస్కారం లభించింది. దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డులను పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనే మూడు విభాగాల్లో ప్రదానం చేస్తున్నారు. కళలు, సామాజిక సేవ, ప్రజావ్యవహారాలు, సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్, వర్తకం, వాణిజ్యం, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, సివిల్‌ సర్వీసెస్‌ వంటి రంగాల్లో అత్యుత్తమ సేవని కనబరిచిన వారికి పద్మ అవార్డులు ప్రదానం చేస్తారు. 

(చదవండి: Padma Awards 2022: బిపిన్‌ రావత్‌కు పద్మ విభూషణ్‌!)

మరిన్ని వార్తలు