టాటా వాహనాల ధరలు పెంపు..ఈ ఏడాది వరుసగా మూడో సారి

5 Nov, 2022 15:03 IST|Sakshi

ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్‌ వాహనాల ధరల్ని మరోసారి పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాదిలో ఇప్పటికే రెండు సార్లు కార్ల ధరల్ని పెంచిన టాటా.. తాజాగా మరోసారి పెంపు నిర్ణయంపై వాహన దారులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. 

ధరల పెంపుకు ప్రధాన కారణం వాహనాల్ని తయారు చేసేందుకు ఉపయోగించే వస్తువుల (ఇన్‌పుట్స్‌) ధరల పెరగడమేనని టాటా తెలిపింది. కంపెనీ ప్రకారం, ఈ ఏడాది జూలైలో తన ప్యాసింజర్ వాహనాల ధరల్ని 0.55 శాతం ధరల్ని పెంచగా..అంతకంటే ముందు జనవరిలో టాటా మోటార్స్ సగటున 0.9 శాతం ధరల్ని పెంచుతూ నిర్ణయించింది. ఆ నిర్ణయంపై కస్టమర్ల నుంచి నెగిటీవ్‌ ఫీడ్‌ బ్యాక్‌ రావడంతో .. ప్రతిస్పందనగా కంపెనీ నిర్దిష్ట వేరియంట్లపై రూ .10,000 వరకు తగ్గించింది.

వాణిజ్య వాహనాల గురించి మాట్లాడుతూ, కంపెనీ ఇప్పటికే ధరలను 1.5 - 2.5 శాతం పెంచింది. పెంచిన ధరలు జూలై 1, 2022 నుండి అమల్లోకి వచ్చాయి. కార్ల ధరల పెంపుకు పెరిగిన కార్ల తయారీకి వినియోగించే వస్తువుల ధరలతో పాటు ట్రాన్స్‌ పోర్ట్‌ ఛార్జీలు పెరగడమేనని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు.

మరిన్ని వార్తలు