TRAI: వాట్సాప్, ఫేస్‌బుక్ నియంత్రణపై చర్చలు - త్వరలో కొత్త రూల్స్!

8 Jul, 2023 16:24 IST|Sakshi

ప్రస్తుతం వాట్సాప్, ఫేస్‌బుక్‌, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్స్ లేకుండా యువతకు సమయమే గడచిపోదు. అయితే వీటిని కొంత మంది మంచి పనుల కోసం ఉపయోగిస్తే.. మరికొందరు దుర్వినియోగం చేస్తున్నారు. అలాంటి అనుచిత సంఘటనకు సంబంధించిన కేసులు గతంలో చాలానే వెలుగులోకి వచ్చాయి. కొన్ని సందర్భాల్లో వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో ఎంతోమంది అకౌంట్స్ కూడా బ్లాక్ చేసింది. అయితే ఇప్పుడు వీటిపైన కొన్ని నియంత్రణలు కల్పించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

నివేదికల ప్రకారం.. వాట్సాప్, ఫేస్‌బుక్, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి ఓవర్-ది-టాప్ (OTT) కమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్‌లను నియంత్రించడంపై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) చర్చలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే అల్లర్లు, ఉద్రిక్త పరిస్థితులలో కమ్యూనికేషన్ యాప్స్ మీద కొంత సమయం లేదా తాత్కాలిక నిషేధం విధించాల్సిన అవసరం ఉందా.. లేదా అనే విషయం మీద చర్చలు మొదలుపెట్టింది.

ఇంటర్నెట్ బేస్డ్ కాల్స్ విషయంలో టెలికామ్ ప్రొవైడర్లకు వర్తించే నియమాలు కమ్యూనికేషన్ యాప్స్‌‌కి కూడా వర్తించేలా చేయాలని సంస్థలు ఎప్పటి నుంచో అడుగుతున్నాయి, అంతే కాకుండా లైసెన్స్ ఫీజులమీద కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ కారణంగా టెలికామ్ విభాగం 'టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా'ను సంప్రదించింది. దీంతో ట్రాయ్ యాప్స్ నియంత్రణ, తాత్కాలిక నిషేధం వంటి 14 అంశాల మీద చర్చలు జరపనుంది.

(ఇదీ చదవండి: రైతుగా మారిన బ్యాంక్ ఎంప్లాయ్.. వేలమందికి ఉపాధి - రూ. కోట్లలో టర్నోవర్!)

వాట్సాప్, టెలిగ్రామ్ మొదలైన వాటికి పూర్తిగా నిషేధించే బదులు అత్యవసర పరిస్థితుల్లో చర్యలు తీసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా యాప్‌లలో ఆర్థిక, భద్రత పరమైన అంశాలను తప్పకుండా పరిశీలించాల్సిన అవసరం ఉందని ట్రాయ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.

మరిన్ని వార్తలు