జియో ఫైనాన్స్‌ పర్సనల్ లోన్స్.. ఇవి ఉంటే చాలు!

30 Nov, 2023 07:26 IST|Sakshi

వ్యక్తిగత, కన్జ్యూమర్, వర్తక రుణాలు

మై జియో యాప్‌పై డిజిటల్‌గా ఆఫర్‌

న్యూఢిల్లీ: జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌కు చెందిన జియో ఫైనాన్స్‌ తన రుణ వితరణ వ్యాపారాన్ని ప్రారంభింంది. తొలుత పర్సనల్‌ లోన్స్, కన్జ్యూమర్‌ డ్యూరబుల్‌ లోన్స్, మర్చంట్‌ ట్రేడ్‌ క్రెడిట్‌ ఫెసిలిటీని ఆరంభింంది. జియో ఫైనాన్స్, మై జియో మొబైల్‌ అప్లికేషన్స్‌ ద్వారా వేతన జీవులు, స్వయం ఉపాధిలో ఉన్న వారికి డిజిటల్‌ పర్సనల్‌ లోన్స్‌ ఆఫర్‌ చేస్తోంది. 

పాన్‌ కార్డ్, ఆధార్‌ కార్డ్, ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్‌ నంబర్‌ ఉంటే చాలు. రుణాన్ని వేగంగా పొందొచ్చు. కన్జ్యూమర్‌ డ్యూరబుల్‌ లోన్స్‌ కింద ఖరీదైన మొబైల్‌ ఫోన్లు, ఏసీలు, కెమెరా కొనుగోళ్లకు రుణాలను అందిస్తోంది. మర్చంట్‌ వెబ్‌ సైట్లపై నోకాస్ట్‌ ఈఎంఐ ఆప్షన్‌ కింద ఈ ఉత్పత్తులను కొనుగోలు చేసుకోవచ్చు. 

‘‘జియో ఫైనాన్స్‌ కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌ రుణాలను అందిస్తోంది. తయారీదారులు, ఓఈఎంలు లేదా డీలర్లు ఈ రుణాలపై వడ్డీని భరిస్తారు. దీంతో నో కాస్ట్‌ ఈఎంఐ ప్రయోజనాన్ని వినియోగదారులు పొందొచ్చు. కాకపోతే కస్టమర్లు ప్రాసెసింగ్‌ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది’’అని జియో ఫైనాన్స్‌  పేర్కొంది.

ఇన్వెంటరీ కొనుగోళ్లకూ రుణాలు
వ్యాపారస్థులకు రుణాలను కూడా జియో ఫైనాన్స్‌ ప్రారంభింంది. అన్‌ సెక్యూర్డ్‌ మర్చంట్‌ ట్రేడ్‌ క్రెడిట్‌ ఫెసిలిటీని తన ప్లాట్‌ఫామ్‌పై నమోదైన వర్తకులకు అందించనుంది.  జియో ఫైనాన్షియల్‌  రిలయన్స్‌ నుం విడిపోయి ఎక్సే్ఛంజ్‌లలో లిస్టయింది. ఇన్సూరెన్స్‌ బ్రోకింగ్, మ్యూచువల్‌ ఫండ్స్‌ సేవలను సైతం ఈ సంస్థ త్వరలోనే అందించనుంది.

మరిన్ని వార్తలు