వెబ్‌3తో భారత్‌లో భారీగా కొలువులు.. భారీ వేతనాలకు ఆస్కారం!

30 Nov, 2023 07:49 IST|Sakshi

ప్రైమస్‌ పార్ట్‌నర్స్‌ నివేదిక

న్యూఢిల్లీ: బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీ ఆధారిత కొత్త తరం వెబ్‌3 రంగంతో భారత్‌లో ఉపాధి కల్పనకు ఊతం లభించగలదని మేనేజ్‌మెంట్‌ కన్సల్టింగ్‌ సేవల సంస్థ ప్రైమస్‌ పార్ట్‌నర్స్‌ ఒక నివేదికలో తెలిపింది. దీని వల్ల భారీ వేతనాలు లభించేందుకు ఆస్కారమున్న 20 లక్షల పైచిలుకు కొలువులు రాగలవని పేర్కొంది.

ప్రస్తుతం దేశీయంగా వెబ్‌3 రంగంలోని 900 పైగా సంస్థలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని వివరింంది. 2022లో మొత్తం వెబ్‌3 డెవలపర్‌ కమ్యూనిటీలో మన వాటా 11 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. సరఫరా వ్యవస్థ నిర్వహణ, ఆరోగ్య సేవల్లో గోప్యత, విద్య, వోటింగ్‌ సిస్టమ్స్, ఐడెంటిటీ మేనేజ్‌మెంట్‌ తదితర విభాగాల్లో ఇది ఉపయోగపడుతోందని వివరింంది. దీన్ని బాధ్యతాయుతంగా అనుసంధానం చేయగలిగితే పరిశ్రమల ముఖచిత్రం మారిపోగలదని ఈ నివేదికలో ప్రైమస్‌ పార్ట్‌నర్స్‌ పేర్కొంది.

వెబ్ 3.0 అనేది ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న ఒక టెక్నాలజీ, వెబ్ 1.0 నుంచి వెబ్ 2.0కి పురోగతి చెందటానికి పది సంవత్సరాల సమయం పట్టినట్లు తెలిసింది. ఇప్పడు వెబ్ 3.0 పూర్తిగా డెవలప్ కావడానికి అంతకంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో భారీ కొలువులు లభిస్తాయని స్పష్టమవుతోంది.

వెబ్ 3.0 వల్ల మెరుగైన అనుభవాలు, డేటా భద్రత, గొప్ప ఆర్థిక అవకాశాలు వంటి అనేక ప్రయోజనాలను తెస్తుందని అంచనా వేస్తున్నారు. వీటి వల్ల వినియోగదారుల డేటా చాలా పటిష్టంగా ఉంటుంది. అయితే ఈ టెక్నాలజీ ఉపయోగించడానికి కొన్ని సాంకేతికలు నేర్చుకోవాల్సి ఉంటుంది.

మరిన్ని వార్తలు