ఇండిపెండెన్స్‌డే ఆఫర్లు... తగ్గిన రెడ్‌మీ ఫోన్ల ధరలు

9 Aug, 2021 14:59 IST|Sakshi

స్వాతంత్ర దినోత్సవ కానుకగా షావోమీ తన మొబైల్‌ ఫోన్లపై ప్రత్యేక తగ్గింపు ధరలను ఆఫర్‌ చేస్తోంది. రీసెంట్‌గా మార్కెట్‌లో రిలీజైన మోడల్స్‌తో పాటు రన్నింగ్‌లో ఉన్న మొబైల్స్‌పై ఈ తగ్గింపును వర్తింప చేస్తోంది. ఈ మేరకు షావోమి తన ట్విట్టర్‌ పేజీ ద్వారా అధికారిక ప్రకటన జారీ చేసింది. 

ఎంఐ ఎక్స్‌ 11 5 జీ
Xiaomi's Mi 11X 5G మొబైల్‌ ప్రస్తుతం మార్కెట్‌ ధర రూ.27,999లు ఉండగా ప్రత్యేక ఆఫర్‌ కింద రెండు వేలు తగ్గించారు.

ఎంఐ 10టీ ప్రో 5జీ
 Xiaomi Mi 10T Pro ధర రూ. 39,999 ఉండగా ఇండిపెండెన్స్‌ డే ఆఫర్‌ కింద రూ. 36,999కి లభిస్తోంది.

ఎంఐ 10ఐ
Mi 10i మిడ్‌రేంజ్‌ సెగ్మెంట్‌లో ఎంఐ 10ఐ మొబైల్‌ని లాంచ్‌ చేసినప్పుడు ధర రూ.21,999 ఉండగా ఇప్పుడు రూ. 20,999కి తగ్గించింది.

రెడ్‌మీ 9
Redmi 9 మొబైల్‌ ఫోన్‌ ధర రూ. 8,999 ఉండగా రూ. 1500 తగ్గింపు ప్రకటించింది.

స్టార్ట్‌ టీవీపై కూడా 
స్వాతంత్ర దినోత్సవ తగ్గింపు ఆఫర్లను ఆగస్టు 5 నుంచి 9 వరకు షావోమీ అమలు చేస్తోంది. మొబైల్‌ ఫోన్లతో పాటు హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డు ఉపయోగించి షావోమీ స్మార్ట్‌టీవీ కొనుగోలు చేస్తే గరిష్టంగా రూ. 7,500ల వరకు క్యాష్‌బ్యాక్‌ అమలు చేస్తోంది. దీంతో పాటు 20,000 ఎంఏహెచ్‌ పవర్‌బ్యాంక్‌పై రూ.500 తగ్గింపు అందిస్తోంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు