హైదరాబాద్‌: ఇద్దరు యువతుల అదృశ్యం కలకలం

7 Jun, 2021 13:37 IST|Sakshi
అశ్విని (ఫైల్‌), రిషిదా (ఫైల్‌)

మల్కాజిగిరి: విద్యార్థిని అదృశ్యమైన ఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమాన్‌పేట్‌కు చెందిన అశోక్‌ కూతురు అశ్విని(19) డిగ్రీ చదువుతోంది. కొన్ని రోజులుగా సెల్‌ఫోనులో ఎక్కువగా మాట్లాడుతుండడంతో తల్లి బాలామణి గమనిస్తుంది. ఈ నెల 4వ తేదీ ముగ్గురు గుర్తు తెలియని మహిళలు వాళ్ల ఇంటికి వచ్చి ఓ యువకుడితో అశ్విని వివాహం గురించి అడగడంతో బాలామణి తిరస్కరించి కూతురిని మందలించింది. అదే రోజూ సూపర్‌ బజార్‌కు వెళ్లిన అశ్విని ఇంటికి తిరిగి రాలేదు. ఈ ఘటన పై ఆదివారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

యువతి అదృశ్యం 
కుత్బుల్లాపూర్‌: ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువతి అదృశ్యమైన ఘటన పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. కుత్బుల్లాపూర్‌ పరిధి శ్రీకృష్ణనగర్‌కు చెందిన శ్రీనుబాషా కుమార్తె రిషిదా(21) విద్యార్థిని. ఈ నెల 5వ తేదీ ఉదయం 8.30 గంటలకు రిషిదా ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లింది. రాత్రైనా ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు యువతి స్నేహితులు, బంధువుల ఇళ్లల్లో వాకబు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదివారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: ఏటీఎంలో చోరీ.. గంటలోనే దొంగ పట్టివేత!

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు