సఖి సెంటర్‌లో నవ వధువు ఆత్మహత్య

28 Dec, 2020 01:14 IST|Sakshi

సాక్షి, జనగామ: ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంటను వారి కుటుంబాలు కాదు పొమ్మనడంతో.. ప్రేమికురాలు ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన ఆదివారం జనగామ జిల్లా కేంద్రం సఖి సెంటర్‌లో చోటు చేసుకుంది. జనగామ సీఐ మల్లేశ్‌ కథనం ప్రకారం.. కొడకండ్ల మండలం ఏడునూతల గ్రామానికి చెందిన మద్దెబోయిన నర్సయ్య కూతురు శ్రీలేఖ(20), అదే గ్రామానికి చెందిన దేశబోయిన మనోహర్‌ (20) ప్రేమించుకున్నారు.

ఈనెల 16న ఇద్దరూ ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. హైదరాబాద్‌లో ఈ నెల 22న శ్రీలేఖ, మనోహర్‌ ప్రేమ వివాహం చేసుకుని, రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించారు. ఇరువురి కుటుంబాలకు పోలీసులు సమాచారం అందించగా కొత్త జంటను తీసుకువెళ్లేందుకు నిరాకరించారు. దీంతో శ్రీలేఖను రక్షణ కోసం జనగామలోని సఖి సెంటర్‌కు పంపించారు. సఖి సెంటర్‌లో మానసిక వేదనకు గురైన శ్రీలేఖ.. టాయిలెట్‌ డోర్‌కు చున్నీతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు