భర్త వేధింపులు తట్టుకోలేక పుట్టింటికి.. మేనబావ చేతిలో హతం

17 Apr, 2021 08:01 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మైసూరు: భర్త వేధింపులు తట్టుకోలేక పుట్టింటికి వచ్చిన మహిళను ఆమె మేనత్త కుమారుడు దారుణంగా నరికి చంపిన ఘటన  మైసూరు జిల్లా బెళవడి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. హెచ్‌డి.కోటె తాలూకాలోని క్యాతనహళ్లి గ్రామానికి చెందిన ప్రేమకుమారి (25)కి భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్త పెట్టే వేధింపులు తాళలేక ఆమె భర్తను వదిలి తన మేనత్త కుమారుడైన కిరణ్‌తో కలిసి ఉంటోంది.

ఈ క్రమంలో వీరి మధ్య కూడా తరచూ గొడవలు జరిగేవి.  గురువారం రాత్రి కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో కిరణ్‌ అర్ధరాత్రి ఆమెను కత్తితో దారుణంగా హత్య చేశాడు. బాధితురాలి అరుపులకు చుట్టుపక్కల వారు వచ్చి ఆస్పత్రికి తరలించారు చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసి కేసు దర్యాప్తు చేపట్టారు.  

చదవండి: ఒక్కదాన్నే ఉన్నా.. నువ్వు రా; ఇంటికి పిలిపించి కాటికి పంపారు
దారుణం: కూతురిపై తండ్రి కాల్పులు

మరిన్ని వార్తలు