-

భారతీయ చేపల ప్యాకెట్లపై కరోనా!

19 Nov, 2020 04:40 IST|Sakshi

చైనా ఆరోపణ 

బీజింగ్‌: భారత్‌ సహా వేర్వేరు దేశాల నుంచి దిగుమతి చేసుకున్న చేపల ప్యాకెట్లపై కరోనా వైరస్‌ ఆనవాళ్లను గుర్తించినట్లు చైనా అధికారులు ప్రకటించారు. ఇండియా, రష్యా, అర్జెంటీనా తదితర దేశాల నుంచి వచ్చిన ఈ ప్యాకెట్లను పరీక్షించగా వాటిపై కరోనా ఆనవాళ్లు ఉన్నట్లు స్పష్టంగా తేలిందని బుధవారం గ్లోబల్‌ టైమ్స్‌ పత్రిక వెల్లడించింది. ఇండియా నుంచి వచ్చిన రెండు బట్టర్‌ఫిష్‌ ప్యాకెట్లు, రష్యా నుంచి వచ్చిన ఒక సాల్మన్‌ ఫిష్‌ ప్యాకెట్, అర్జెంటీనా నుంచి దిగుమతి చేసుకున్న రెండు బీప్‌ ప్యాకెట్ల ఉపరితలాలపై కరోనా వైరస్‌ ఆనవాళ్లను గుర్తించామని అధికారులు తెలిపినట్లు పేర్కొంది. 20 దేశాల నుంచి వచ్చిన వివిధ ఉత్పత్తుల ప్యాకెట్లపైనా వైరస్‌ ఉన్నట్లు వెల్లడైందని అధికారులు పేర్కొన్నారు. భారత్‌ నుంచి దిగుమతి అయిన ప్యాకెట్లపై వైరస్‌ ఆనవాళ్లు ఉన్నాయంటూ చైనా ప్రకటించడం ఇది రెండోసారి. దిగుమతుల పరీక్షలు, నిబంధనల విషయంలో చైనా అసంబద్ధంగా వ్యవహరిస్తోందని, ఇది వాణిజ్యాన్ని దెబ్బతిస్తోందని పలు దేశాలు ఆరోపిస్తున్నాయి.
 

మరిన్ని వార్తలు