బాప్‌రే!.. ఆ జంట దొంగలించిన వైన్‌ బాటిల్స్‌ ఖరీదు రూ.3 కోట్లా!

31 Oct, 2021 17:48 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

స్పెయిన్‌: మాములుగా ఇళ్లను చోరి చేస్తే బంగారం, డబ్బు ఇంత పోయింది అంటూ బెంబేలెత్తిపోతాం . కానీ ఏ రెస్టారెంట్లలోనో లేక షాపుల్లోనో చోరికి జరిగితే లక్షల్లో నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఓ రెస్టారెంట్‌లో ఓ జంట ఏకంగా కోట్లు ఖరీదు చేసే వైన్‌ బాటిల్స్‌ని చోరీ చేశారటా. అసలు ఎక్కడ ఎవరా ఆ జంటా అనుకుంటున్నారా.

(చదవండి: లక్కీ హ్యండ్‌! 20 లాటరీ టికెట్లు.. 20 సార్లూ అదృష్టం!)

అసలు విషయంలోకెళ్లితే....సౌత్‌వెస్టర్ స్పెయిన్‌లోని ఒక స్పానిష్ రెస్టారెంట్‌లో ఓ జంట సుమారు రూ.3 కోట్లు విలువ చేసే 45 వైన్ బాటిళ్లను దొంగిలించినట్లు  ఆ రెస్టారెంట్‌ అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ఆ వైన్‌ బాటిళ్లు అత్యంత అరుదుగా లభించే 215 ఏళ్ల నాటివి. అంతేకాదు వాటి ఖరీదు దాదాపు 4 లక్షల డాలర్లు(రూ.3 కోట్లు). ఆ హోటల్‌ యజామానుల్లో ఒకరైన జోస్‌ పోల్‌ మాట్లాడుతూ.... ఆజంట ఇంగ్లీష్‌ అనర్గళంగా మాట్లాడగలరు.

ఆ రోజు ఆ జంట మా హోటల్‌లో భోజనం చేస్తూ తమకు మరింత భోజనం కావాలంటూ హోటల్‌ ఫ్రంట్‌ డెస్క్‌ని అడిగారు. దీంతో ఆ రోజు హోటల్‌ సిబ్బంది వారికి ఆహారం వడ్డించడంలో నిమగ్నమైపోయారు. అయితే ఆ సమయంలో ఆ జంటలో ఒకరు హోటల్‌ సెల్లారులోకి వెళ్లారు.

సెల్లారులో 40 వేలకు పైన అత్యంత అరుదుగా లభించే ఖరీదైన వైన్‌ బాటిల్స్‌ ఉన్నాయి. అంతేకాదు వారు దొంగలించిన బాటిల్స్‌ని మార్కెట్‌లో మార్చలేరు పైగా వాటిన్నింటికి భీమా ఉంది" అన్నారు. ఈ మేరకు కాసెరెస్‌లోని జాతీయ పోలీసు ప్రతినిధి వైన్‌ బాటిల్స్ చోరి గురించి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.

(చదవండి: హౌరా బ్రిడ్జ్‌ పై జౌరా అనిపించే డ్యాన్స్‌)

మరిన్ని వార్తలు