వారం రోజులుగా ఓడలోనే చిక్కుకుపోయిన ప్రయాణికులు.. న్యూ ఇయర్ ప్లాన్ రివర్స్.. తీవ్ర ఆగ్రహం..

2 Jan, 2023 17:14 IST|Sakshi

న్యూజిలాండ్‌కు చెందిన ఓ క్రూజ్ షిప్ వారం రోజులుగా ఎక్కడా ఆపకుండా సముద్రంలోనే ఉండిపోయింది. జనవరి 1న ఆస్ట్రేలియా చేరుకోవాల్సిన ఈ ఓడ.. అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో ముందుకు వెళ్లే పరిస్థితి లేక ఆగిపోయింది. దీంతో న్యూ ఇయర్ సెలబ్రేషన్ గ్రాండ్‌గా ప్లాన్ చేసిన వందల మంది ప్రయాణికులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. సదరు ఓడను నిర్వహిస్తున్న సంస్థపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఎందుకు ఆపారు? 
అయితే ఈ ఓడ హల్‌(అడుగు భాగం)పై ఫంగస్ పేరుకుపోయింది. బ్యాక్టిరీయా, సూక్ష‍్మ జీవలు, మొక్కలు వంటి బయోఫౌల్ పెరిగింది. ఇది తమ జలాల్లోలోకి ప్రవేశిస్తే హానికరం అని భావించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం.. ఓడను లంగర్లు వేసుకునేందుకు అనుమతించలేదు. దీంతో గజ ఈతగాళ్లను పెట్టి ఆ ఫంగస్‌ను మొత్తం తొలగించారు. అనంతరం ఆస్ట్రేలియా ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఓడ కదిలింది.

అయితే ఈ కారణంగా జనవరి1న గమ్యానికి చేరుకోవాల్సిన క్రూజ్ షిప్ జనవరి 2న చేరుకుంటోంది. ఈ ఓడలో ఎక్కువమంది ప్రయాణికులు ఆస్ట్రేలియాకు చెందిన వారే ఉన్నారు.
డిసెంబర్ 23న ఈ క్రూజ్ షిప్ న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ పోర్టు నుంచి బయలుదేరింది. చివరిసారి డిసెంబర్ 26న వెల్లింగ్‌టన్ పోర్టులో ఆగింది. ఆ తర్వాత వారం రోజుల పాటు ఇందులోని ప్రయాణికులు భూమిపై కాలు పెట్టలేకపోయారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో ఓడలోనే ఉన్నారు. ఈ కారణంగా నాలుగు స్టాపుల్లో క్రూజ్ షిప్ ఆగలేదు. తమ జలాల్లోకి ప్రవేశించే ప్రతి ఓడను చెక్ చేశాకే అనుమతిస్తామని ఆస్ట్రేలియా చెప్పింది. ఫంగస్ ఉన్నందునే న్యూజిలాండ్ ఓడను ఆపినట్లు స్పష్టం చేసింది.

దిద్దుబాటుగా క్యాష్‌బ్యాక్‌..
మరోవైపు ప్రయాణికుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తం కావడంతో వికింగ్ ఓరియన్ ఓడ నిర్వాహకులు దిద్దుబాటు చర్యలకు దిగారు. అసౌకర్యం కలిగినందుకు క్షమాపణలు కోరారు. పరిహారంగా టికెట్‌ ఖరీదులో కొంత వెనక్కి ఇస్తామన్నారు.
చదవండి: ఆకాశంలో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. అందులో ఒకటి..!

మరిన్ని వార్తలు