ఉబర్‌ డ్రైవర్‌పై​ మహిళ దాడి.. ‘నాకిద్దరు సిస్టర్స్‌ ఉన్నారు’

23 Apr, 2021 19:33 IST|Sakshi

ఫ్లోరిడాలో చోటు చేసుకున్న సంఘటన

ఫ్లోరిడా: మధ్య వయస్కురాలైన ఓ నర్సు ఉబర్‌ డ్రైవర్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. అతడి గొంతు పట్టుకుని చితకబాదింది. మహిళ తనను ఇంతలా బాధపెడుతున్న సదరు డ్రైవర్‌ ఆమె మీద చేయి చేసుకోలేదు. అందుకు అతడు చెప్పిన కారణం ప్రతి ఒక్కరిని కట్టి పడేసింది. ‘‘నాకు ఇద్దరు సోదరీమణలు ఉన్నారు. ఆడవారికి గౌరవం ఇవ్వాలని నా తల్లి నాకు చిన్నప్పటి నుంచి బోధించింది. అవే నేను పాటించాను’’ అన్నాడు. ఇంతకు సదరు నర్స్‌ అతడిపై ఎందుకు దాడి చేసింది అనేది మాత్ర తెలియలేదు. ఈ సంఘటన ఫ్లోరిడాలోని సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ ప్రాంతంలో ఈ నెల 17న చోటు చేసుకుంది. 

ఆ వివరాలు.. మైఖెల్‌ స్టిల్‌విల్‌ అనే లేడీ నర్స్‌ ఏప్రిల్‌ 17న సాయంత్రం ఐదు గంటలకు ఉబర్‌ కారు బుక్‌ చేసుకుంది. హస్సీ జూనియర్‌ అనే వ్యక్తి ఆమెను పికప్‌ చేసుకోవడానికి వచ్చాడు. కారు ఎక్కిన తర్వాత మైఖెల్‌ నిద్రలోకి జారుకుంది. మెలకువ వచ్చిన తర్వాత సడెన్‌గా హస్సీపై దాడి చేయడం ప్రారంభించింది. వెనక ప్యాసింజర్‌ సీటులో కూర్చున్న మైఖెల్‌ నిద్ర నుంచి లేచి.. వెనక నుంచి హస్సీ మెడ పట్టుకుని అతడిని కొట్టడం ప్రారంభించింది. ‘నా కూతురు’ అంటూ అరుస్తూ.. అతడిపై పిడి గుద్దులు కురిపించింది. హస్సీ ఆమె నుంచి తప్పించుకోవడానికి ట్రై చేశాడు కానీ కుదరలేదు. 

ఇంతలో మైఖెల్‌ ముందుకు వచ్చి అతని ఛాతీపై గోళ్లతో గీరింది.. లోతైన గాయం చేసింది. అతడికి ఏమాత్రం తప్పించుకునే అవకాశం ఇవ్వకుండా దాడి చేసింది. దారిన పోయే వారు దీన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి సదరు నర్స్‌ను అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా హస్పీ మాట్లాడుతూ.. ‘‘ఏం జరిగితే అదే జరుగుతుంది.. నేను మాత్రం ఆమెపై చేయి చేసుకోవద్దని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే నాకు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. పైగా చిన్నతనం నుంచి ఆడవారిపై చేయి చేసుకోకూడదు అనే వాతావరణంలో నేను పెరిగాను. అందుకే ఆమెపై ప్రతి దాడి చేయలేదు’’ అన్నాడు. ఈ సంఘటన జరిగిన సమయంలో నర్స్‌ మత్తులో ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. 

చదవండి: 
మాస్క్‌ ధరించమన్నందుకు ఉబర్‌ డ్రైవర్‌పై మహిళ దాడి
ఈమె 8 మంది శిశువులను చంపారట!

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు