Viral Video:150 కిలోల పేలుడు పదార్థాలు.. క్షణాల్లో నేలమట్టమైన బ్రిడ్జి.. వీడియో వైరల్..

9 May, 2023 10:12 IST|Sakshi

బెర్లిన్‌: జర్మనీలో ఓ వంతెన క్షణాల్లో నేలమట్టమైన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. లుడెన్‌స్కీడ్‌లోని రమీడ్ వ్యాలీలో ఉన్న ఈ బ్రిడ్జిని 1965, 1968 మధ్య నిర్మించారు. అయితే దీనికి పగుళ్లు రావడంతో కొద్ది కాలంగా మూసివేశారు. ఎలాంటి వాహనాలను దీనిపైకి అనుమతించడం లేదు. ఈక్రమంలోనే ఇక్కడ కొత్త బ్రిడ్జిని నిర్మించేందుకు పాత బ్రిడ్జిని కూల్చివేశారు అధికారులు. చుట్టుపక్కల ఇళ్లు, భవనాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా సరైన జాగ్రత్తలు తీసుకుని బ్రిడ్జిని కూల్చివేశారు.

450 మీటర్ల పొడవైన ఈ వంతెనను నేలమట్టం చేసేందుకు 150 కిలోల పేలుడు పదార్థాలను ఉపయోగించారు అధికారులు. ఈ బ్రిడ్జి కూల్చివేతను ప్రత్యక్షంగా తిలకించేందుకు వేల మంది అక్కడకు తరలివెళ్లారు. కొద్ది దూరంలో నిల్చోని చూశారు. ఈ దృశ్యాలను తమ ఫోన్లలో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో అవి వైరల్‌గా మారాయి.

చదవండి: షాకింగ్‌.. భారత్‌లోకి ప్రవేశించిన పాకిస్తాన్ విమానం..10 నిమిషాల పాటు 141 కి.మీ చక్కర్లు..!

మరిన్ని వార్తలు