షాకింగ్‌: తల్లి శవాన్ని కొరుక్కుతిన్న రాక్షస కుమారుడు

17 Jun, 2021 13:26 IST|Sakshi

స్సెయిన్‌లో చోటు చేసుకున్న భయానక సంఘటన

మాడ్రిడ్‌: కొన్ని నేర వార్తలు చదువుతుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. సమాజంలో ఇలాంటి రాక్షసులు ఉంటారా అనిపిస్తుంది. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి స్పెయిన్‌లో చోటు చేసుకుంది. నరరూప రాక్షసుడైన ఓ వ్యక్తి కన్నతల్లిని చంపి.. ముక్కలుగా కోసి.. వాటిలో కొన్నింటిని తిన్నాడు. రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఈ దారుణం వివరాలు.. స్పెయిన్‌కు చెందిన అల్బెర్టో శాంచెజ్ గోమెజ్ అనే వ్యక్తికి, అతడి తల్లికి మధ్య చిన్న వివాదం చోటు చేసుకుంది.

అది కాస్త ముదరడంతో ఆగ్రహించిన గోమెజ్‌ తల్లిని చంపాడు. ఆ తర్వాత ఆమె శరీరాన్ని ముక్కలుగా చేసి కొన్నింటిని ప్లాస్టిక్‌ కవర్‌లో పెట్టి బయట పడేశాడు. మరి కొన్ని భాగాలను టప్పర్‌వేర్‌ బాక్స్‌ల్లో పెట్టి ఫ్రిజ్‌లో నిల్వ చేసి 15 రోజుల పాటు తిన్నాడు. గోమెజ్‌ దారుణం గురించి తెలిసిన పోలీసులు ఫిబ్రవరి,2019న అతడిని అరెస్ట్‌ చేశారు.

అదే ఏడాది ఏప్రిల్‌లో మాడ్రిడ్‌ కోర్టు అతడికి 15 సంవత్సరాల ఐదు నెలల శిక్ష విధించింది. జైలులో ఉన్న సమయంలో గోమెజ్‌ జరిగిన నష్టానికి గాను తన సోదరుడికి 73వేల డాలర్లు(53,87,976రూపాయలు) చెల్లిస్తానని.. విడుదల చేయాల్సిందిగా కోరాడు. కానీ కోర్టు అతడి అభ్యర్థనని తోసి పుచ్చింది. ఇలాంటి నరమాంస భక్షకులు బయట ఉండటం చాలా ప్రమాదం అని తెలిపింది. 

చదవండి: మాజీ భార్యపై పగ తీర్చుకోవటానికి సొంత బిడ్డల్ని..

మరిన్ని వార్తలు