Cannes Film Festival 2022: కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో సంచలనం.. దుస్తులు విప్పేసి మహిళ నిరసన.. వీడియో వైరల్‌

21 May, 2022 10:15 IST|Sakshi

cannes film festival.. కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. ఫిల్మ్ ఫెస్టివల్‌ వేదికగా రెడ్ కార్పెట్‌పై ఉక్రెయిన్‌కు చెందిన మహిళ వినూత్న నిరసన తెలిపింది. తమ దేశమైన ఉక్రెయిన్‌లో మహిళలు, యువతులపై రష్యా సైనికుల అత్యాచారాలను ఆపండి అంటూ నినాదాలు చేస్తూ అర్ధనగ్న స్థితిలో నినాదాలు చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

వివరాల ప్రకారం.. కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో శుక్రవారం సందడిగా కార్యక్రమం జరుగుతోంది. ఇంతలో ఉక్రెయిన్‌ చెందిన మహిళ ఒక్కసారిగా రెడ్‌ కార్పెట్‌పైకి తన దుస్తులను విప్పి.. నిరసన తెలిపింది. ఆమె శరీరంపై ఉక్రెయిన్‌ జెండా రంగులను వేసుకొని.. ‘‘మాపై అత్యాచారం ఆపండి’’ అని అంటూ నినాదాలు చేస్తూ నిరసల ప్రదర్శించింది. దీంతో ఒక్కసారిగా అక్కడున్న వారంతా షాకయ్యారు. అప్రమత్తమైన సిబ్బంది ఆమెపై దుస్తులు కప్పి అక్కడి నుంచి బయటకు తీసుకువెళ్లారు. 

ఇదిలా ఉండగా..  కేన్స్ వేడుకల్లో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ భావోద్వేగ ప్రసంగం చేశారు. ఉక్రెయిన్‌ నుంచి లైవ్‌ శాటిలైట్‌ వీడియో ద్వారా కేన్స్‌ ప్రారంభోత్సవంలో జెలెన్‌ స్కీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌పై రష్యా బలగాల దాడుల్లో తమ దేశ పౌరులు వేల సంఖ్యలో చనిపోతుంటే సినీ ప్రపంచం మౌనంగా ఉంటుందా అని ప్రశ్నిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈక్రమంలోనే ఉక్రెయిన్‌ రష్యా బలగాలు దురాగతాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. తమ దేశ యువతులు, మహిళలపై రష్యన్లు అత్యాచారాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఇప్పటికైనా ఉక్రెయిన్‌లో రష్యా దురాక్రమాలపై సినీ ప్రపంచం గొంతెత్తి ఖండించాలని జెలెన్‌స్కీ విజ్ఞప్తి చేశాడు.

ఇది కూడా చదవండి: డ్రాగన్‌ సైనిక విన్యాసాలు

మరిన్ని వార్తలు