ప్రపంచంలోనే తొలి రోబో లాయర్‌..ఏకంగా ఓ కేసునే టేకప్‌ చేస్తోంది

9 Jan, 2023 12:21 IST|Sakshi

ప్రపంచంలోనే తొలి రోబో లాయర్‌ కేసును లాయర్‌ మాదిరిగా సలహాలిచ్చి కేసును వాదించుకునేలా గైడ్‌ చేస్తుంది.  2015లో జాషువా బ్రౌడర్‌ అనే శాస్త్రవేత్త రోబో లాయర్‌ని రూపొందించారు. ఆయన డూనాట్‌పే లీగల్‌ సర్వీస్‌ చాట్‌బోట్‌ అనే ఒక  స్టార్ట్‌అప్‌ కంపెనీని స్థాపించి న్యాయ సేవలను అందిస్తున్నారు. దీనికి సంబంధించిన అప్లికేషన్‌ స్మార్ట్‌ఫోన్‌లో రన్‌ అవుతోంది. నిజ జీవితంలోని కేసులన్నింటిని హెడ్‌ఫోన్‌ సాయంతో విని తన క్లయింట్‌కి సలహలు, సూచనలు ఇస్తుంది.

ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ సాయంతో రూపొందించిన ఈ రోబో లాయర్‌ తొలుత కేసులకు సంబంధించిన జరిమానాలు, ఆలస్యంగా చెల్లించే రుసుమలు విషయంలో వినియోగదారులకు చట్టపరమైన సలహాలు అందించేది.  ఇప్పుడూ ఏకంగా కేసును లాయర్‌ మాదిరిగా టేకప్‌ చేసి క్లయింట్‌ని తగిన విధంగా గైడ్‌ చేసి వాదించుకునేలా చేస్తుంది. 

ప్రస్తుతం ఈ రోబో యూకేలోని ట్రాఫిక్‌ టిక్కెట్‌కి సబంధించిన ప్రతివాది కేసును వచ్చే నెలలో వాదించనుంది. ఈ కేసుకు సంబంధించి రోబోకి శిక్షణ ఇవ్వడానికి చాలా సమయం పట్టిందని బ్రౌడర్‌ అన్నారు. ఫిబ్రవరిలో యూకే కోర్టులో ఈ కేసు విచారణ జరగనున్నట్లు తెలిపారు. కోర్టులో సమాచారాన్ని ప్రాసెస్‌ చేసి, వాదనలను విశ్లేషించి తన క్లయింట్‌కి తగిన సలహాలిస్తుంది. ఒక వేళ ఈ కేసు ఓడిపోతే జరిమాన కట్టడానికి సదరు సంస్థ అంగీకరించినట్లు సమాచారం.

పార్కింగ్‌, బ్యాంకులకు, కార్పొరేషన్‌, బ్యూరోక్రసీకి సంబంధించిన కేసుల విషయమై కోర్టులో దావా వేయడం,  వాదించడం వంటి వాటిల్లో ప్రజలకు సాయం చేస్తోంది. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించడంలో ఉపయోగపడుతోంది. దీనివల్ల క్లయింట్‌కి కోర్టు ఖర్చు కూడా తగ్గుతుందని చెబుతున్నారు. అయితే యూకేలో న్యాయవాదిని నియమించుకోవడం అనేది చాలా ఖర్చుతో కూడిన పని, పైగా సుమారు రూ. 20 వేల నుంచి లక్ష రూపాయాల వరకు ఖర్చు పెట్టాలని బ్రౌడర్‌ చెబుతున్నారు.

అంతేగాదు యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్‌లో ఇంకా చాలా మంది మంచి లాయర్లు ఉంటారు, కానీ చాలా మంది లాయర్లు డాక్యుమెంట్‌లను కాపీ చేసి పేస్ట్ చేయడానికి చాలా ఎక్కువ డబ్బు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఈ సమస్యలన్నింటికీ ఈ రోబో లాయర్‌ చెక్‌ ్‌పెడుతుందని ఆనందంగా వెల్లడించారు సైంటిస్ట్‌ బ్రౌడర్. ఐతే ఈ రోబో లాయర్‌ యూకేలోని ఏకోర్టులో ఏ ‍ క్లయింట్‌ తరుఫున వాదిస్తుందన్నది శాస్త్రవేత్త వెల్లడించలేదు. 

(చదవండి: విమానంలో మరో ప్రయాణికుడి వీరంగం..షర్ట్‌ లేకుండా పిడిగుద్దులతో..)

మరిన్ని వార్తలు