చిరు చెల్లిగా కీర్తి, ఆమెకంత రెమ్యునరేషన్‌ అవసరమా!

7 Aug, 2021 19:39 IST|Sakshi

కీర్తి సూరేశ్‌ ‘మహానటి’ మూవీ తర్వాత మహిళ నేపథ్యం ఉన్న సినిమాలపై దృష్టి పెట్టింది. ఓ వైపు గ్లామర్‌ పాత్రల్లో నటిస్తూనే లేడి ఓరియంటెట్‌ చిత్రాలను ఎంచుకుంటుంది. ఈ క్రమంలో ఆమె నటించిన ‘పెగ్విన్‌, మిస్‌ ఇండియా’ చిత్రాలు అంతగా గుర్తింపు పొందలేదు. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీసు వద్ద పరాజయం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆమె సైడ్‌ క్యారెక్టర్‌లోనూ నటించేందుకు సిద్దమైంది. స్టార్‌ హీరోలకు చెల్లెలి పాత్రల్లో నటించేందుకు కీర్తి ఏమాత్రం వెనకాడటం లేదు. ఈ క్రమంలో సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నటిస్తున్న అన్నాత్తే మూవీలో రజనీకి సోదరిగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక తాజాగా మెగాస్టార్‌ చిరంజీవికి కూడా చెల్లిగా నటించేందుకు ఆమె గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తమిళంలో హిట్‌గా నిలిచిన వేదాళం మూవీని చిరు ప్రధాన పాత్రలో మెహర్‌ రాజా రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో చిరు సోదరి పాత్రకు దర్శక-నిర్మాతలు మొదట కీర్తిని సంప్రదించడంతో వెంటనే ఒకే చెప్పిందట. అంతేగాక ఈ మూవీకి భారీ మొత్తంలో పారితోషికం డిమాండ్‌ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే లేడి ఒరియంటెడ్‌ చిత్రాలకే అంత పారితోషికం తీసుకోనప్పుడు, సైడ్‌ క్యారెక్టర్‌కు అంత ఇవ్వడం ఎందుకని చిరు అభిప్రాయపడ్డారట. అంతేగాక ఈ విషయంపై ఆయన మేకర్స్‌ను వారించినట్లు వినికిడి. దీనిపై చర్చలు జరుగుతుండగానే కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా షూటింగ్‌లు ఆగిపోవడంతో చిరు సలహా మేరకు కీర్తికి ప్రత్యామ్నాయం దర్శక-నిర్మాతలు మరో నటిని వేతికే పనిలో పడ్డారట.

ఎవరు దొరకపోవడంతో మేకర్స్‌ కీర్తినే ఫైనల్‌ చేద్దామని చిరును ఒప్పించారట. అలా ఆమె అడిగినంత రెమ్యునరేషన్‌ ఇచ్చి కీర్తినే ఖారారు చేసేందుకు రెండోసారి ఆమెను సంప్రదించారట దర్శక-నిర్మాతలు. అయితే ఈసారి ఆమె మరో కోటి పెంచి మొత్తం 3 కోట్ల రూపాయలు డిమాండ్‌ చేసినట్లు టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం లూసిఫర్‌ మూవీకి డేట్స్‌ ఇచ్చిన చిరు వేదాళం మూవీకి కూడా తన డేట్స్‌ను సర్దుబాటు చేసుకునేందుకు ప్లాన్‌ చేస్తున్నాడట. దీంతో త్వరలోనే వేదాళం మూవీని సెట్స్‌పై తీసుకొచ్చేందుకు మేకర్స్‌ సిద్దమవుతున్నారు. ఈ సమయంలో వేరే నటిని వేతకడం కంటే కీర్తినే ఫైనల్‌ చేమాలని నిశ్చయించుకుని, ఆమె అడిగినంత ఇచ్చేందుకు మేకర్స్‌ రేడి అయ్యారట. దీంతో మొత్తానికి కీర్తి తన రెమ్మునరేషన్‌ విషయంలో మాట నెగ్గించుకుందంటూ సినీవర్గాలు చర్చించుకుంటున్నాయి.

మరిన్ని వార్తలు