Sakshi News home page

Indian Railways: అయోధ్యకు 1,000 రైళ్లు..

Published Sun, Dec 17 2023 5:29 AM

Indian Railways: 1,000 trains to run from different parts of country to Ayodha - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో భవ్య రామమందిరం ప్రారం¿ోత్సవానికి ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 22వ తేదీన ఆలయంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం తర్వాత జనవరి 23వ తేదీ నుంచి భక్తులకు దర్శనభాగ్యం కలి్పంచనున్నారు. ఈ నేపథ్యంలో దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు అయోధ్య పట్టణానికి పోటెత్తనున్నారు.

ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు చెందిన భక్తులు రైలు మార్గంలో అయోధ్యకు చేరేందుకు వీలుగా రైల్వే సరీ్వసులను భారీగా పెంచాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. రద్దీని దృష్టిలో ఉంచుకుని రామాలయం ప్రారంభం అయిన రోజు నుంచి తొలి 100 రోజుల పాటు అయోధ్యకు వేయికిపైగా రైళ్లను నడిపాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రైల్వే శాఖ వర్గాలు తాజాగా వెల్లడించాయి.  

19వ తేదీ నుంచే మొదలు!
మందిర ప్రారం¿ోత్సవానికి కొన్ని రోజుల ముందు నుంచే ఈ అదనపు రైల్వే సరీ్వసులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. జనవరి 19వ నుంచి ఈ అదనపు రైళ్లను నడపాలని రైల్వే శాఖ అధికారులు భావిస్తున్నారు. 100 రోజుల పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, నాగ్‌పుర్, లక్నో, జమ్మూ, పుణె, కోల్‌కతా సహా దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాల నుంచి అయోధ్యకు రైళ్లు నడపనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

డిమాండ్‌కు అనుగుణంగా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. వీటితోపాటు కొన్ని రైళ్లను ప్రత్యేకంగా భక్తుల కోసం రిజర్వ్‌చేసి నడపనున్నారు. ప్రతిరోజూ  ఈ రైళ్లలో ప్రయాణించే భక్తులకు ఆహారం అందించేందుకు ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేయనుంది. ఈ రైళ్లలో ప్రయాణించాలనుకునే వారికోసం ఈనెల 23 నుంచి రిజర్వేషన్‌ టికెట్‌ బుకింగ్‌కు అవకాశం కలి్పంచనున్నారు. అయితే దీనిపై రైల్వే శాఖ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు, భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అయోధ్యలోని రైల్వేస్టేషన్‌లో ఆధునికీకరణ పనులు శరవేగంగా

కొనసాగుతున్నాయి. రోజుకు 50,000
మంది ప్రయాణికులు వచి్చనా ఎలాంటి ఇబ్బందులు పడకుండా సకల సదుపాయాలు అందుబాటులో ఉండేలా రైల్వేస్టేషన్‌ను నవీకరిస్తున్నారు. జనవరి 15వ తేదీ కల్లా స్టేషన్‌ పనులు పూర్తి అయ్యే అవకాశం ఉంది. సంక్రాంతి తర్వాత రామ్‌ లల్లా ప్రతిష్టాపన క్రతువు మొదలుపెట్టి దాదాపు పది రోజుల పాటు ’ప్రాణ ప్రతిష్ఠ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆలయ నిర్వహణ సంస్థ ప్రత్యేకంగా ఆహా్వనించడం తెల్సిందే. మోదీతోపాటు 4,000 మంది సాధువులు, వేలాది మంది ప్రముఖులు ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు. 

Advertisement

What’s your opinion

Advertisement