రోడ్డు ప్రమాదంలో వరుడు, వధువు మృతి 

5 Aug, 2021 07:37 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి,చెన్నై: పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఓ జంట మృత్యుఒడిలోకి చేరింది. బంగారం కొనేందుకు బైక్‌పై వెళ్తూ ఎదురుగా వచ్చిన మరో మోటారు సైకిల్‌ రూపంలో మృత్యువాత పడ్డారు. కోయంబత్తూరు జిల్లా మేట్టుపాళయం కారమడైకు చెందిన సుబ్రమణియన్‌ కుమారుడు అజిత్‌(23), అన్నురుకు చెందిన కరుప్పుస్వామి కుమార్తె ప్రియాంక(22)లకు నిశి్చతార్థం జరిగి సెపె్టంబరు మొదటి వారంలో పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మంగళవారం ఆడిపెరుక్కు సందర్భంగా ప్రియాంకకు బంగారం కొనివ్వడానికి అజిత్‌ నిర్ణయించాడు. ప్రియాంక, ఆమె బంధువు తాలత్తురుకు చెందిన సెవ్వాని(23)లతో కలిసి మేట్టుపాళయంకు వెళ్లాడు. పనులు ముగించుకుని తిరుగు పయనం అయ్యారు.

అన్నురు మెయిన్‌ రోడ్డులో వెళుతుండగా ఎదురుగా వచ్చిన మరో మోటారు సైకిల్‌ వీరి బైక్‌ను ఢీకొంది. ఈప్రమాదంలో అజిత్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రియాంకకు తీవ్రగాయాలయ్యాయి. సెవ్వాని çస్పృహ తప్పింది. స్పృహలోకి వచ్చిన సెవ్వాని ఇచ్చిన సమాచారంతో ఇరు కుటుంబాలు పరుగులు తీశాయి. ప్రియాంకను కోయంబత్తూరు ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి ఆమె మృతిచెందింది. పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఈ జంట మృత్యుఒడిలోకి చేరడం రెండు కుటుంబాల్ని విషాదంలోకి నెట్టింది.  

తప్పిన పెనుప్రమాదం.. 
కన్యాకుమారికి చెందిన వినో పడవను చిన్నముట్టంకు చెందిన జ్ఞానసెల్వన్‌ సముద్రంలోకి వేట నిమిత్తం తీసుకెళ్లాడు. 14 మందితో కలిసి వేటను ముగించుకుని మంగళవారం అర్ధరాత్రి ఒడ్డుకు తిరుగు పయనం అయ్యారు.  పడవలో సాంకేతిక లోపంతో మంటలు చెలరేగడంతో అందులో ఉన్నవారు ఆందోళనకు గురయ్యారు. అదే సమయంలో మరో పడవ అటు రావడంతో  ఆ పడవను ఆశ్రయించారు. అయితే, వినోకు చెందిన రూ. కోటి విలువగల పడవ పూర్తిగా దగ్ధమైంది. 

అగ్నిప్రమాదం.
చెన్నై మదురవాయిల్‌ బైపాస్‌లో ఓ ప్రైవేటు స్థలంలో సినిమా సెట్టింగ్‌లకు ఉపయోగించే వస్తువుల్ని భద్రపరిచారు. ఇక్కడ షార్ట్‌షర్క్యూట్‌ కారణంగా బుధవారం సాయంత్రం మంటలు చెలరేగాయి. అగి్నమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటల్ని అదుపుచేయడానికి ప్రయతి్నంచాయి. పక్కనే ఉన్న కార్ల విడి భాగాల తయారీ పరిశ్రమను సైతం మంటలు చుట్టుముట్టడంతో ఆందోళన నెలకొంది. కొన్ని గంటల పాటు శ్రమించి మంటల్ని అదుపు లోకి తెచ్చారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు