వధువు ఎంట్రీ మాములుగా లేదు! దివి నుంచి వచ్చిన దేవతలా దిగింది

11 Dec, 2022 19:43 IST|Sakshi

ఇటీవల వధువరులు భలే గ్రాండ్‌గా పెళ్లి చేసుకుంటున్నారు. కొందరూ తమ రేంజ్‌కి తగ్గట్టుగా పెళ్లి చేసుకుంటే, మరికొందరూ అతి తక్కువ ఖర్చుతో కూడా పెళ్లి చేసుకోవచ్చు అని చేసి చూపిస్తున్నారు. అదంతా ఒక ఎత్తైతే..పెళ్లి మండపానికి కూడా వధువు లేదా వరుడు కూడా చాలా వైరైటీగా ఎంట్రీ ఇచ్చి బంధువులను, కుటుంబ సభ్యులను ఆశ్చర్యపరుస్తున్నారు. అదే తరహాలో ఇక్కడొక పెళ్లి కూతురు ఇచ్చిన ఎంట్రీ చూస్తే వామ్మో! అంటారు.

వివరాల్లో కెళ్తే...ఇక్కడొక వధువు తన తండ్రితో కలిసి ఆకాశం నుంచి దిగి వచ్చిన దేవతలా గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చింది. అక్కడ ఉన్న వాళ్లంతా ఆ! అని ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆ పెళ్లి మండపంలోని సీలింగ్‌కి కేబుల్స్‌తో సస్సెండ్‌ చేసిని అందమైన రోప్‌వే మాదిరిగా ఉండే దానిలో నుంచొని వచ్చింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోని చూసి కొందరూ నెటిజన్లు ఏదైనా అనుకోని ప్రమాదం జరిగి పడిపోతే ఏమౌవుతుంది అంటూ మండిపడుతూ రకరకాలు ట్వీట్‌ చేశారు. 

(చదవండి: ఈగనా మజాకా! ఏకంగా పది గ్రామాల్లో పెళ్లిళ్లు ఆగిపోయాయి..)

మరిన్ని వార్తలు