వైరల్‌ వీడియో: మైండ్‌ బ్లోయింగ్‌ బ్యాలెన్సింగ్‌

12 Nov, 2020 16:04 IST|Sakshi

జిమ్నాస్టిక్స్ గేమ్స్‌ గురించి అందరికీ తెలిసిందే. చైనా, రష్యాలో ఎక్కువగా ప్రాచూర్యం పొందిన ఈ క్రీడ.. అంత సులువైన కాదు. ఎంతో శ్రమతో కూడుకున్నది కావడంతో చాలా తక్కువ మంది దీనిని ఎంచుకుంటున్నారు. ఒక్కోసారి ఈ గేమ్‌లో విజయం సాధించడానికి రోజుల తరబడి ప్రాక్టీస్‌ చేయకతప్పదు. అయితే ఇలాంటి ఓ గేమ్‌లో సస్సెస్‌ అయ్యేందుకు ఓ క్రీడాకారుడు పట్టువదలని విక్రమార్కుడిలా  పోరాటం చేశాడు. చివరికి 148వ ప్రయత్నంలో తన లక్ష్యాన్ని చేరుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోను ఫ్రీ స్టయిల్‌ స్కైయర్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేశారు. 148 ప్రయత్నాలు విఫలమయ్యాక 149 వసారి సరిగ్గా వచ్చిందంటూ కామెంట్‌ చేశారు. ఈ విన్యాసాన్ని ముఖానికి మాస్క్‌ ధరించి చేయడం మరో ప్రత్యేకం. ఈ వీడియోలో ఎలాంటి పరికరాల సహాయం లేకుండా ముందుగా ఏర్పాటు చేసుకున్న వస్తులను దాటడం ద్వారా ఒక పాయింట్ నుంచి మరొకదానికి చేరుకోవడానికి ఆండ్రీ  విన్యాసాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. వీడియో మొత్తం స్కేట్‌ బోర్డులు, వివిధ వస్తులు, బంతులు, తాడులపై బ్యాలెన్స్‌ చేస్తూ చివరిగా సరైన ల్యాండింగ్‌ను అందుకున్నాడు.

ఈ వీడియోను ఇప్పటికే వేల మంది వీక్షించగా అనేక మంది లైక్‌ చేశారు. ‘పట్టుదలతో కృషి చేస్తే ఏదైనా సాధ్యం అవుతుందని నిరూపించాడు. అద్భుతంగా ఉంది’ అని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు .కాగా ఈ స్టంట్‌పై జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా ప్రశంసలు కురిపించారు. ఆండ్రీ మెలుకువలను ఆయన ప్రశంసించారు. ఈ బ్యాలెన్సింగ్‌ క్రేజీగా ఉందంటూ, జీవితాన్ని కూడా ఇలా సమన్వయం చేసుకుంటూ పోవాలనే అర్థం వచ్చేలా రీట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు