టీఎంసీకి మరో షాక్‌.. మమతా బెనర్జీ మేనల్లుడికి ఈడీ సమన్లు

30 Aug, 2022 15:28 IST|Sakshi

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ అధికార పార్టీకి మరో షాక్‌ ఇచ్చింది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ). ఇప్పటికే స్కూల్‌ జాబ్స్‌ స్కామ్‌లో కీలక నేత పార్థా ఛటర్జీని అరెస్ట్‌ చేయగా.. తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీకి సమన్లు జారీ చేసింది. బొగ్గు అక్రమ రవాణా కుంభకోణం కేసులో భాగంగా శుక్రవారం కోల్‌కతాలోని తమ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. 

‘మా అధికారుల ముందు విచారణకు హాజరుకావాలని అభిషేక్‌ బెనర్జీకి సమన్లు జారీ చేశాం. ఆయను విచారించేందుకు ఢిల్లీ నుంచి మా అధికారులు వస్తారు.’ అని తెలిపారు ఈడీ సీనియర్‌ అధికారి ఒకరు. మరోవైపు.. కోల్‌కతాలో  ఓ ర్యాలీలో సోమవారం పాల్గొన్న మమత బీజేపీపై విమర్శలు గుప్పించారు. తన మేనల్లుడికి కేంద్ర దర్యాప్తు సంస్థలు నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోపించారు. ఆమె భావించినట్లుగానే ఆ మరుసటి రోజునే ఈడీ సమన్లు జారీ చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదీ చదవండి: ‘మీకు చేతనైతే నన్ను అరెస్ట్‌ చేయండి’.. బీజేపీకి మమతా బెనర్జీ సవాల్‌

మరిన్ని వార్తలు