కల్లోలం: ఇద్దరు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేలు మృతి

30 Apr, 2021 19:35 IST|Sakshi

లక్నో: మహమ్మారి కరోనా వైరస్‌ దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో కల్లోలం రేపుతోంది. ఈ వైరస్‌ ధాటికి మంత్రులు, ఎమ్మెల్యేలు తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తోపాటు చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు కరోనా బారినపడ్డారు. ఆ రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య కూడా భారీగానే ఉంది. ఇప్పటివరకు యూపీకి చెందిన ఇద్దరు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేలు కరోనా బారినపడి మృత్యువాత పడ్డారు. వారిలో ఒకరు తాజాగా బుధవారమే మృత్యువాత పడ్డారు.

కరోనాపై తన వ్యాఖ్యలతో సంచలనం రేపిన ఎమ్మెల్యేనే కరోనా బారిన పడి కన్నుమూశారు. ఆయనే నవాబ్‌గంజ్‌ బీజేపీ ఎమ్మెల్యే కేసర్‌ సింగ్‌ గంగ్వార్‌ కరోనాతో బాధపడుతూ బుధవారం మృతి చెందాడు. అంతకుముందు ఆయన కరోనాపై ‘కరోనా ఎక్కడ ఉంది? అసలు మాస్క్‌లు ధరించడం అవసరమా?’ అని అప్పట్లో ప్రశ్నించాడు. అంతే కాకుండా పోయిన సంవత్సరం, ఈసారి కరోనా విజృంభిస్తున్నా కూడా ఆయన కనీసం మాస్క్‌ ధరించకుండా విచ్చలవిడిగా తిరిగాడు. 

అంతకుముందు ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు మంత్రులు కరోనా బారినపడి చనిపోయారు. మంత్రులు చేతన్‌ చౌహన్‌, కమలరాణి వరుణ్‌, లక్నో పశ్చిమ ఎమ్మెల్యే సురేశ్‌ శ్రీవాస్తవ, ఆరయ్య సదర్‌ ఎమ్మెల్యే రమేశ్‌ దివాకర్‌ కరోనా బారినపడి కన్నుమూశారు. వీరితోపాటు చాలా మంది ప్రజాప్రతినిధులు, ప్రముఖులు కరోనా వైరస్‌ బారిన పడ్డారు. తాజాగా శుక్రవారం 332 మంది కరోనాతో మృత్యువాత పడగా కొత్త కేసులు 34,626 నమోదయ్యాయి. మొత్తం కేసులు 12,52,324.

చదవండి: సన్యాసం తీసుకున్న ముఖేశ్‌ అంబానీ స్నేహితుడు
చదవండి: తీరని విషాదం.. తొక్కిసలాటలో 44 మంది మృతి

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు