సిట్‌ సూచనపై బాధిత కుటుంబం ఆగ్రహం

3 Oct, 2020 15:58 IST|Sakshi

లక్నో: నిందితులతో సహా బాధితురాలి కుటుంబ సభ్యులకు కూడా నార్కో ఎనాలసిస్‌ పరీక్షలు చేయాలన్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) సూచనల్ని హథ్రాస్‌ బాధిత కుటుంబం ఖండించింది. ఆ సూచనలు చేసినవారే టెస్టులు చేయించుకోవాలని మండిపడింది. కాగా, దారుణం వెలుగుచూసిన ఐదు రోజుల తర్వాత తొలిసారి మీడియాను గ్రామంలోకి అనుమతించారు. గ్రామంలో సిట్‌ దర్యాప్తు పూర్తి కావడంతో.. మీడియాపై నిషేదాన్ని ఎత్తివేశామని పోలీసులు తెలిపారు. దీంతో గ్రామంలోకి వెళ్లిన జాతీయ మీడియా ప్రతినిధులు బాధితురాలి ఇంటిని పరిశీలించారు. ప్రస్తుతానికి మీడియాను అనుమతించామని, పైనుంచి ఆదేశాలు వస్తే ఎవరినైనా అనుమతిస్తామని పోలీసులు చెప్పారు. బాధిత కుంటుంబ సభ్యుల ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని, వారిని గృహ నిర్బంధం చేశామని వస్తున్న ఆరోపణలు నిజం కాదని అన్నారు.
(చదవండి: ప్రియాంక డ్రైవింగ్..‌ పక్కనే రాహుల్‌ గాంధీ)

కాగా, హథ్రాస్‌ గ్రామంలో పొలం పనులు చేసుకుంటున్న 20 ఏళ్ల యువతిపై సెప్టెంబర్‌ 14న నలుగురు వ్యక్తులు దారుణానికి ఒడిగట్టారు. ఆమెపై అత్యాచారానికి పాల్పడి పాశవికంగా హతమార్చారు. ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గత మంగళవారం ఆమె మరణించింది. ఇక బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు న్యాయం చేయాలని రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ గత గురువారం హథ్రాస్‌ పర్యటనకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. దీంతో కాంగ్రెస్‌, కేంద్ర సర్కారు మధ్య పరస్పర విమర్శల దాడి కొనసాగుతోంది. ఈక్రమంలోనే నేడు (శనివారం) రాహుల్‌, ప్రియాంక మరోసారి హథ్రాస్‌ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. (చదవండి: రాజకీయాలు కాకుంటే.. మళ్లీ ఎందుకు?)

మరిన్ని వార్తలు