వ్యాక్సిన్ వేసుకుంటే ఆ రెస్టారెంట్ లో 20% డిస్కౌంట్

11 Jul, 2021 20:04 IST|Sakshi

జోధ్ పూర్: నావెల్ కరోనా వైరస్ ను అరికట్టడానికి వ్యాక్సినేషన్ మాత్రమే ఏకైక మార్గం నిపుణులు పేర్కొంటున్నారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవడంలో ప్రజలు తమ వంతు సహాయం అందిస్తున్నారు. వ్యాక్సిన్ వేసుకోవడం ద్వారానే ఈ మహమ్మరిని అరికట్టడానికి రోగనిరోధక శక్తిని పొందవచ్చు. వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రోత్సహించడంలో భాగంగా రాజస్థాన్ లోని ఒక రెస్టారెంట్ యజమాని వ్యాక్సిన్ వేసుకున్న వారికి మంచి ఆఫర్ ప్రకటించాడు. జోధ్ పూర్(రాజస్థాన్)లోని వేద్ పేరుతో ఉన్న ఒక రెస్టారెంట్ కు సింగిల్ డోసు వేసుకున్న కస్టమర్ వెళ్తే బిల్లుపై 10 శాతం డిస్కౌంట్, అలాగే సెకండ్ డోస్ వేసుకున్న కస్టమర్ 20 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. "వ్యాక్సిన్ వేయించుకోవడానికి ప్రజలను ప్రోత్సహించడమే మా లక్ష్యం" అని రెస్టారెంట్ యజమాని అనిల్ కుమార్ మీడియా మాట్లాడుతూ చెప్పారు. 

మరిన్ని వార్తలు