గృహమే కదా ‘పని’ సీమ

28 Jan, 2021 18:47 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఇంటి నుంచి పని చేయడానికి ఆసక్తి చూపుతున్న మహిళలు

కాస్పర్‌స్కీ సర్వేలో ఆసక్తికర విషయాలు

19 దేశాలకు చెందిన 13 వేల మందితో సర్వే

వృత్తిజీవితంలో పురోగతి తగ్గిందన్న భావన

సాక్షి, న్యూఢిల్లీ: ఇంటి నుంచే కార్యాలయ పని చక్కపెట్టేస్తాం అంటున్నారు భారతీయ మహిళలు. ఐటీ రంగానికి చెందిన మహిళల్లో 38 శాతం మంది ఇంటినుంచి పని చేయడానికే ఆసక్తి చూపుతున్నారని ఓ సర్వేలో తేలింది. గత ఏడాది నవంబర్‌– డిసెంబర్‌ కాలంలో సైబర్‌ సెక్యూరిటీ సంస్థ కాస్పర్‌స్కీ ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ, ఐటీ సంస్థల్లో పనిచేసే పురుషులు, మహిళల అభిప్రాయాలు సేకరించి సర్వే చేసింది. ఆఫీస్‌ కంటే ఇంటి నుంచి పనిచేయడం వల్లే ఎక్కువ స్వయం ప్రతిపత్తి ఉన్నట్లు భావిస్తామని 36 శాతం మహిళలు తెలిపారు.

ఇంటి నుంచి పని చేయడం వల్ల రోజువారీ ఇంటి పని విషయాలు వారు పేర్కొన్నారు. ఆఫీస్‌ పనిచేస్తూనే ఇంటి పనీ పూర్తి చేసుకుంటు న్నామని 33 శాతం పురుషులు, 54 శాతం మహిళలు తెలిపారు. 40 శాతం మంది పురుషులతో పోలిస్తే 54 శాతం మంది మహిళలకు పిల్లలకు చదువు చెప్పాల్సిన బాధ్యత ఉంది. కుటుంబాన్ని చూసుకోవాల్సి రావడంతో మహిళలు పని వేళలు మార్చుకుంటున్నారు. కరోనా ప్రభావంతో వృత్తిజీవితంలో పురోగతి తగ్గిందని 76 శాతం భారతీయ మహిళలు భావిస్తున్నారు. ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించిన ఈ సర్వేలో 19 దేశాలకు చెందిన 13 వేల మంది పాల్గొనగా 500 మంది భారతీయులు ఉన్నారు.  

చదవండి:
విద్యార్థులు, నిరుద్యోగులకు డీఆర్‌డీఓ శుభవార్త

ప్రపంచ విలువైన కంపెనీల్లో టీసీఎస్‌

మరిన్ని వార్తలు